నిత్యామీనన్‌పై అక్షయ్ కుమార్ కామెంట్స్.. తన బతుకును ఇలా చేసిందంటూ!

టాలీవుడ్ సహా దక్షిణాది భాషల్లో ప్రేక్షకుల మనసు దోచుకుంది బొద్దుగుమ్మ నిత్యామీనన్. తన ముద్దు ముద్దు మాటలతో సౌత్ ఇండియన్ తెరపై ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవలే బాలీవుడ్ గడప తొక్కింది. తన మొదటి సినిమానే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించింది. 'మిషన్ మంగళ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా హీరో అక్షయ్ కుమార్.. నిత్యామీనన్ పై ఓ రేంజ్ కామెంట్స్ చేశాడు. నిత్యా తన బతుకును డబ్బావాలా బతుకు చేసిందని పేర్కొని ఆశ్చర్య పర్చాడు.

ఈ సందర్బంగా మీడియాతో కాసేపు ముచ్చటించిన అక్షయ్.. నిత్యా మీనన్ మంచి నటి అని పేర్కొన్నాడు. సౌత్ ఇండియన్ భాషల్లో ఆమె నటించిన చిత్రాలు, ఆమెకు వచ్చిన అవార్డుల గురించి గొప్పగా చెప్పిన ఆయన.. నిత్యా మీనన్ ఓ తిండి బోతు అని చెప్పడం గమనార్హం. తిండి కోసం ఆమె తనను ఎంతగా ఇబ్బంది పెట్టేదో కూడా వివరించాడు అక్షయ్. నిత్యాకు ఏం కావాలన్నా నేరుగా తనకే ఆర్డర్ చేసేదని, తన బతుకును డబ్బావాలా బతుకు చేసిందని ఆసక్తికరంగా మాట్లాడారు అక్షయ్ కుమార్. నిత్యామీనన్ ఒక్కరే కాదు.. సినిమాలో నటించిన మహిళలంతా అలాగే చేశారని, తనతో బ్రేక్ ఫాస్ట్ కూడా తయారు చేయించేవారని చెప్పుకొచ్చాడు. అక్షయ్ మాటలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా నవ్వులమయం అయింది.

Akshay Kumar Comments On Nithya Menen

మిషన్ మంగళ్ చిత్రంలో వర్షగౌడ అనే శాస్త్రవేత్త పాత్రలో నటించింది నిత్యా మీనన్. మిషన్ మంగళ్ రూపొందించడం కోసం కృషి చేసిన శాస్త్రవేత్తల బృందంలో ఒకరుగా ఆమె నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15 వ తేదీన మిషన్ మంగళ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X