అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం.. ప్రాణం ఉంటేనే ప్రపంచ మనుగడ అంటూ

కరోనావైరస్ ప్రభావంతో దేశం తల్లడిల్లిపోతున్న సమయంలో సినీ, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు తమ మానవత్వాన్ని చాటుకొంటూ ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు మానసిక ధైర్యాన్ని నింపేందుకు సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా అందిస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ పిలుపుకు స్పందించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భూరి విరాళాలన్ని అందించారు. ఆయన దేశం కోసం ఎంత ప్రకటించారంటే..

Recommended Video

Akshay Kumar Donates Rs 25 Cr To PM Narendra Modi's Cares Fund
ప్రధాని మోదీ పిలుపు

ప్రధాని మోదీ పిలుపు

దేశంలోని పరిస్థితిని వివరిస్తూ ప్రధాని మోదీ పీఎం కేర్స్ ఫండ్ అనే ఖాతాను ప్రారంభించారు. ఈ ఖాతాకు ఎవరైనా తమకు తోచిన విధంగా, తమ శక్తి మేరకు సహాయాన్ని అందించాలి. పౌరుల ప్రయోజనాలను రక్షించేందుకు ఈ ఖాతా నిధులను వినియోగిస్తాం అని ప్రధాని ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ ఖాతాకు డెబిట్, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర మార్గాల ద్వారా విరాళాలను అందించవచ్చు అని పేర్కొన్నారు.

స్పందించిన అక్షయ్ కుమార్

స్పందించిన అక్షయ్ కుమార్

ప్రధాని మోదీ పిలుపునకు స్పందించిన అక్షయ్ కుమార్ భారీ విరాళాన్ని అందించారు. మిగతా సినీ ప్రముఖులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలే ముఖ్యం. అందుకోసం ఎంతకైనా, దేనికైనా సిద్ధం కావాలి అని అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

25 కోట్ల విరాళం

25 కోట్ల విరాళం

ప్రధాని పిలుపునకు తాను సిద్ధమయ్యానని, నా వంతుగా ప్రధాని పేర్కొన్న పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందించాలని నిర్ణయించాను. నా సేవింగ్స్‌ నుంచి రూ.25 కోట్లు విరాళం ప్రకటిస్తున్నాను. ప్రజల ప్రాణాలను కాపాడుదాం. ప్రాణం ఉంటేనే ఈ ప్రపంచం మనుగడ ఉంటుంది అని ఎమోషనల్‌గా స్పందించారు.

దేశ మనుగడ కోసం ప్రాణాల్ని కాపాడుదాం

దేశ మనుగడ కోసం ప్రాణాల్ని కాపాడుదాం

దేశం కోసం అక్షయ్ కుమార్ స్పందించడం ఇదే మొదటిసారి కాదు. పలు సందర్భాల్లో అక్షయ్ ప్రభుత్వాలకు అండగా నిలిచారు. తాజాగా రూ.25 కోట్ల విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రియల్ హీరో అంటూ కీర్తిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X