కష్టాల్లో ఉన్న సినీ కార్మికులకు అక్షయ్ చేయూత.. పెద్ద మనసు చాటుకొని
బాలీవుడ్ అక్షయ్ కుమార్ మరోసారి మానవత్వాన్ని చాటుకొన్నారు. కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జూనియర్ ఆర్టిస్టులను భారీ విరాళంతో ఆదుకొన్నారు. ఇప్పటికే ప్రధాని నిధికి 25 కోట్ల రూపాయలు, ముంబై పోలీస్ ఫౌండేషన్‌కు రూ.2 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ అండ్ టెలివిజన్ ఆర్టిస్టుల అసోసియేషన్‌కు రూ.45 లక్షల రూపాయల విరాళం అందించారు.
అక్షయ్ కుమార్ విరాళం గురించి సంఘం అధ్యక్షుడు అమిత్ బెహల్ స్పందించారు. అక్షయ్ కుమార్ మా అసోసియేషన్‌కు రూ.45 లక్షల విరాళం అందించారు. సంఘంలోని ప్రతీ సభ్యుడికి రూ.3 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అక్షయ్ అందించిన విరాళం వల్ల 1500 మందికి లబ్ది చేకూరుతుంది అని తెలిపారు. అయితే నిర్మాత సాజిద్ నడియావాలా సలహా మేరకు అక్షయ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకొన్నారని వెల్లడించారు.

సినీ పరిశ్రమలో రోజువారి వేతన కార్మికులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని అక్షయ్ దృష్టికి సాజిద్ తీసుకెళ్లారు. ఆ విషయం తెలుసుకొన్న అక్షయ్ తన పెద్ద మనసు చాటుకొన్నారు అని బెహల్ పేర్కొన్నారు. చాలా మంది కార్మికులు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారి కష్టాలను చూసి చాలా మంది ప్రముఖులు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ముందుకొస్తున్నారు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











