Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Super Singer 2 షోలో ఎమోషనల్ మూమెంట్.. అందరి ముందు ఏడ్చేసిన స్టార్ హీరో
ఇటీవల కాలంలో ప్రముఖ పోగా మంచి ప్రజాదరణ అందుకుంటున్న సింగింగ్ షోలలో సూపర్ సింగర్ ఒకటి. మొదటి సీజన్ కు మంచి స్పందన రావడంతో ఇప్పుడు హిందీలో రెండవ సీజన్ కూడా అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సింగింగ్ షోకు ప్రముఖ సినీ తారలు కూడా ప్రత్యేక అతిధులుగా వస్తున్నారు. ఇక రీసెంట్గా మరొక స్టార్ హీరో కూడా ఈ సింగింగ్ షోలో పాల్గొన్నాడు. ఇక అతను హ్యాపీ మూమెంట్స్ ను షేర్ చేసుకుంటూనే మరొకవైపు కంటతడి పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అతను మరెవరో కాదు టాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.
కామెడీ సినిమాలతో అలాగే మంచి సందేశాత్మక చిత్రాలతో కూడా ఎంతగానో ఆకట్టుకునే అక్షయ్ కుమార్ మ్యూజిక్ అంటే కూడా ఎంతో ఇష్టపడతాడు. అయితే ఈ క్రమంలో ఎప్పటినుంచో అతనికి ఒక సింగింగ్ షోలో పాల్గొనాలని ఉందట. ఆ కారణం చేతనే ఇప్పుడు సూపర్ సింగర్ సీజన్ 2 లో ఒక ప్రత్యేక అతిథిగా పాల్గొన్నాడు. ఇక అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరితోనూ ప్రత్యేకంగా మాట్లాడిన అక్షయ్ కుమార్ ఒక సమయంలో మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
రాఖీ స్పెషల్ ఎపిసోడ్ గా నిర్వహించిన సూపర్ సింగర్ షోలో అక్షయ్ కుమార్ రక్షాబంధన్ గురించి అనేక విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు. అలాగే అతని రక్షా బంధన్ సినిమా నెక్స్ట్ వీక్ విడుదల కానుంది. అయితే ఈ క్రమంలోనే అతని సోదరి అల్కా భాటియా రాఖీ కట్టిన ఫోటోలను వీడియోగా చేసి చూపించారు. ఇక ఆ వీడియో చూస్తున్నంత సేపు మొదట్లో నవ్వుకున్న అక్షయ్ కుమార్ ఆ తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయాడు.
చాలామంది ఎదురుగానే ఉన్నప్పటికీ కూడా అతను ఏడవడం అందరిని కూడా కదిలించింది ఎందుకంటే ఆ వీడియోలో తన చెల్లి మాటలు కూడా ఉన్నాయి. ఆ మాటలకే అక్షయ్ కుమార్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. కేవలం ఒక అన్నగానే కాకుండా తండ్రిగా కూడా కుటుంబానికి అండగా నిలిచావు అంటూ నాకోసం ఎంతో చేశావని ఆమె చెప్పగానే అక్షయ్ కుమార్ కంటతడి పెట్టాడు. అయితే చెల్లెలి గురించి కూడా అక్షయ్ కుమార్ ఎంతో గొప్పగా చెప్పాడు. అప్పటివరకు మేము ఒక చిన్న ఇంట్లో ఉండే వాళ్ళం.. కానీ ఎప్పుడైతే మా చెల్లెలు దేవతగా వచ్చిందో అప్పటినుంచి మా జీవితాలు చేంజ్ అయ్యాయి. ఇక అన్నాచెల్లెళ్ల బంధం కన్నా మరొక గొప్ప బంధం ఇంకొకటి ఉండదేమో అని కూడా అక్షయ్ కుమార్ ఎమోషనల్ అవుతు వివరణ ఇచ్చాడు.