అక్షయ్ కుమార్ నెల ఖర్చు ఎంతో తెలుసా?.. ప్రతిరోజు పడుకొనే ముందు ట్వింకిల్‌ ఖన్నాతో..

బాలీవుడ్‌ హీరో, హీరోయిన్లు అంటే అర్ధరాత్రి వరకు పార్టీలు, పబ్‌లతో ఎంజాయ్ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కిలాడీ అక్షయ్ కుమార్ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ఆరోగ్యం, ఆహర నియమాలను వందశాతం పాటించేందుకు ప్రయత్నిస్తారు. పార్టీలకు, పబ్‌లకు, మద్య, ధూమపానాలకు చాలా వ్యతిరేకం. ఈ విషయాన్ని పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలే కాదు.. ఆయన కూడా స్వయంగా చెప్పుకొంటారు. ఆయన కొన్ని ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు మీ కోసం..

ఉదయం నాలుగు గంటలకే దినచర్య

ఉదయం నాలుగు గంటలకే దినచర్య

షూటింగ్ ఉన్నా లేకున్నా అక్షయ్ కుమార్ దినచర్య ఉదయం 4 గంటలకే ప్రారంభం అవుతుంది. సాధారణంగా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ సమయానికి పార్టీల నుంచి తిరిగి వచ్చి నిద్రకు ఉపక్రమిస్తారు. అక్షయ్ జాగింగ్‌కు వెళ్తున్న సమయంలో చాలా మంది హీరో, హీరోయిన్లు పార్టీల నుంచి తిరిగి వస్తూ ఆయనకు ఎదురుపడుతారట.

ధూమ, మద్యపానానికి దూరంగా

ధూమ, మద్యపానానికి దూరంగా

ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటారు. రాత్రి 9.30 నుంచి 10 గంటల మధ్యలో నిద్రకు ఉపక్రమిస్తాను. ఉదయమే లేచి వర్కవుట్లు చేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యమనే విషయాన్ని బలంగా నమ్ముతాను. షూటింగులకు లేటుగా వెళ్లడం వల్ల నిర్మాతకు, ఇతర నటీనటులకు ఇబ్బందిగా కలుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొంటాను అని అక్షయ్ కుమార్ చెప్పారు.

భార్య ట్వింకిల్ ఖన్నాతో

భార్య ట్వింకిల్ ఖన్నాతో

ఇక ఫ్యామిలీకి అత్యంత ప్రధాన్యత ఇచ్చే అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాతో అన్యోన్యంగా ఉంటారు. ప్రతీ రోజు పడుకోనే ముందు భార్యతో పేకాట (రమ్మీ) అడుతాడట. ఈ పేకాటలో ట్వింకిల్‌కు ఇప్పటి వరకు రూ.4.5 లక్షల రూపాయలు బాకీ పడ్డారట. ఫిజికల్‌గా డబ్బులు పెట్టకుండా నోటి లెక్క ప్రకారం పేకాటలో మనీ పెట్టి ఆడుతామని అక్షయ్ కుమార్ చెప్పారు.

నెలసరి ఖర్చు ఎంతంటే

నెలసరి ఖర్చు ఎంతంటే

ఆ మధ్య కపిల్ శర్మ కామెడీ నైట్స్‌కు హాజరైన అక్షయ్ కుమార్ తన నెలసరి ఖర్చు పది వేల రూపాయల లోపే ఉంటుంది. దాదాపు ఎక్కువంటే మూడు వేలకు మించి నా పాకెట్ మనీ ఖర్చు కాదు. నేను మద్యం సేవించను. సిగరెట్లు తాగను. షూటింగులకు వెళ్తే నిర్మాతే నా ఖర్చంతా భరిస్తారు. ఇక నాకు ఏం ఖర్చు ఉంటుంది చెప్పండి అంటూ అక్షయ్ కుమార్ షాకింగ్ న్యూస్ చెప్పారు.

మంచి పనుల కోసం డబ్బును

మంచి పనుల కోసం డబ్బును

ప్రతీ సినిమాకు కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్‌గా అందుకొంటావు. ఆ డబ్బులన్నీ ఏం చేస్తావు అని కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు.. నా సేవింగ్స్ అకౌంట్‌లోనే ఉంటాయి. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో మంచి పనుల కోసం ఉపయోగిస్తాను. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతాను. డబ్బు విలువ నాకు తెలుసు. దానిని దుర్వినియోగం చేయడం ఇష్టం ఉండదు అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.

25 కోట్ల విరాళం

25 కోట్ల విరాళం


తాజాగా ప్రధాని మోదీ పిలుపు మేరకు స్పందించి.. కరోనాపై పోరాటానికి భారీ విరాళాన్ని అందించారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి రూ.25 కోట్ల రూపాయలను తన సేవింగ్స్ ఖాతా నుంచి ప్రధాని ఏర్పాటు చేసిన నిధికి మళ్లించారు. అక్షయ్ కుమార్ ఇచ్చిన విరాళం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X