Akshay Kumar: స్టార్ హీరోకు తప్పిన ప్రమాదం.. గాయాలతో బయటపడిన అక్కీ.. అక్కడ చికిత్స!

పేరుకు సినిమా వినోదాన్ని పంచేదైనా దానికోసం ఎంతో మంది అనేక విధాలుగా కష్టపడుతుంటారు. అందరూ మెచ్చే సినిమాను చిత్రీకరించేందుకు అహర్నిషలు కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో వారికి అనుకోని సంఘటనలు, ప్రమాదాలు ఎదురవుతుంటాయి. సినిమా చిత్రీకరించే సమయంలో ప్రమాదాల బారిన పడతారు. యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ మూమెంట్స్ ఇలా ఏదో ఒక విషయంలో దెబ్బలు తగిలించుకోవడమో.. యాక్సిడెంట్ జరగడమో అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే స్టార్ హీరోకు ఎదురైంది. ఓ సినిమా షూటింగ్ లో ఆ హీరో గాయలపాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎలా మార్చుకోవడానికైనా..

ఎలా మార్చుకోవడానికైనా..


బాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్. మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం పొందిన అక్షయ్ కుమార్ సినిమాల్లో ఒరిజనల్ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులకు రియల్ వినోదాన్ని పంచుతుంటాడు. అప్పుడప్పుడు రిస్కీ షాట్స్ చేసి షూటింగ్ లో గాయాల పాలు కూడా అయ్యాడు. ఇక సినిమా కోసం తనను ఎలా మార్చుకోవడానికైన సిద్ధపడతాడు. అలాంటి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా గాయాలపాలయ్యాడు.

యాక్షన్ చిత్రాలతో..

యాక్షన్ చిత్రాలతో..

బాలీవుడ్ లో యాక్షన్ అండ్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఆయన అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. కెనడా ప్రవాస భారతీయుడైన అక్షయ్ కుమార్ ఇప్పటికీ హిందీ చిత్రసీమలో సుమారు 100కుపైగా చిత్రాల్లో నటించారు. 90వ దశకంలో ఎక్కువగా యాక్షన్ చిత్రాలతో అలరించిన అక్షయ్ కుమార్ ఆ తర్వాత కామెడీ మూవీస్ సూపర్ ఎంటర్టైన్ చేశారు. యాక్షన్, కామెడీ మాత్రమే కాకుండా రొమాన్స్ తో కూడా ఆకట్టుకున్నాడు ఈ సీనియర్ హీరో.

రియల్ స్టంట్స్ చేస్తూ..

రియల్ స్టంట్స్ చేస్తూ..

ఇక హిట్లు, ఫ్లాపులు అంటూ చూడకుండా వరుస పెట్టి సినిమాలు చేసే బాలీవుడ్ హీరోలో ఎవరైనా ఉన్నారంటే అది అక్షయ్ కుమారే. అంతేకాకుండా సినిమాల్లో రియల్ స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తాడు అక్కీ. ఇటీవల సూర్యవంశీ, ఆత్రంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, కట్ పుట్లి, రక్షా బంధన్, రామ సేతు వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో సూర్యవంశీ, ఆత్రంగి రే 2021లో రాగా మిగతా 5 చిత్రాలు గతేడాది విడుదల అయ్యాయి.

గిన్నీస్ వరల్డ్ రికార్డ్..

గిన్నీస్ వరల్డ్ రికార్డ్..

అయితే గతేడాది విడుదలైన అక్షయ్ కుమార్ చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన సెల్ఫీ సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కేవలం మూడు నిమిషాల్లో ఏకంగా 184 సెల్ఫీలు దిగి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు అక్షయ్ కుమార్. అయితే ఇమ్రాన్ హష్మీ, అక్కీ నటించిన సెల్ఫీ సినిమా మలయాళం హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ కు రీమెక్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం మూటగట్టుకుంది.

మరో హీరోతో కలిసి..

మరో హీరోతో కలిసి..


సినిమాలు వరుసగా ప్లాప్ అయినప్పటికీ మరో చిత్రంతో ఫుల్ బిజీగా ఉంటాడు అక్కీ. తాజాగా అక్షయ్ బడే మియా ఛోటే మియా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బడే మియా ఛోటే మియా సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు మరో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్కాట్ లాండ్ లో జరుగుతోంది. అక్కడ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో టైగర్ తో కలిసి అక్షయ్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటూ గాయపడ్డాడు.

 క్లోజప్స్ షాట్స్ తీసుకుని..

క్లోజప్స్ షాట్స్ తీసుకుని..

ఆ ప్రమాదంలో అక్షయ్ కుమార్ మోకాలి దగ్గర దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో అక్షయ్ కుమార్ క్లోజప్స్ మాత్రమే తీసుకుని షూటింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం అక్షయ్ స్కాట్లాండ్ లోనే చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే అక్షయ్ విశ్రాంతి తీసుకుంటున్నందున అతను లేని సీన్స్ షూట్స్ చేస్తున్నారట. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణలో ఇంతకుముందు మేకప్ ఆర్టిస్ట్ చిరుత దాడికి గురవ్వడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X