బాహుబలిని కామెడీ చేస్తున్న స్టార్ హీరో.. క్రేజ్ ఈ విధంగా వాడేసుకుంటున్నారు!
బ్లాక్ బస్టర్ సినిమాలకు ఎక్కువగా తెలుగులో పేరడీలు చేస్తుంటారు. సూపర్ హిట్ చిత్రంలోని సన్నివేశాన్ని కానీ, డైలాగ్ ని కానీ ఎదో విధంగా కామెడీ చేసి ఉపయోగించుకోవడం చూస్తూనే ఉన్నాం. చాలా బాలీవుడ్ చిత్రాలకు తెలుగులో లెక్కలేనన్ని పేరడీలు వచ్చాయి. షారుక్, కాజోల్ దిల్ వాలే దూల్హేనియా లే జాయేంగే చిత్రానికి అయితే ఎన్నో పేరడీలు వచ్చాయి. కానీ ఇపుడు బాలీవుడ్ వాళ్ళు మన సినిమాని పేరడీ చేసుకుంటున్నారు.

తెలుగు సినిమా ఖ్యాతి
బాహుబలి చిత్రంతో దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్ళాడు. వివిధ దేశాల మీడియా సంస్థలు బాహుబలి చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తాయి. చైనా, జపాన్ వంటి దేశాల్లో కూడా బాహుబలి చిత్రం విజయం సాధించింది.

బాహుబలి స్పూఫ్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం హౌస్ ఫుల్ 4, కృతి సనన్, పూజ హెగ్డే, రితేష్ దేశ్ ముఖ్, బేబీ డియోల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు. వీళ్లంతా కలసి బాహుబలిని కామెడీ చేయబోతున్నారు. హౌస్ ఫుల్ 4 లో బాహుబలి యుద్దని పేరడీ చేస్తున్నారట.

జైసల్మేర్‌లో
ప్రస్తుతం హౌస్ ఫుల్ 4 చిత్ర షూటింగ్ రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ప్రధాన తరాల మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లోనే బాహుబలి యుద్ధ సన్నివేశాల స్పూఫ్ చిత్రీకరిస్తారట. ఈ విషయాన్ని హీరోయిన్ కృతి సనన్ కూడా ప్రకటించింది.

కనీవినీ ఎరుగని విధంగా
బాలీవుడ్ మీడియా సంస్థతో కృతి సనన్ మాట్లాడుతూ.. బాహుబలి ఫన్నీ సీన్స్ చిత్రీకరణ విషయంలో తాను చాలా ఆసక్తిగా ఉన్నా. ఆ సన్నివేశాల కోసం మా గెటప్స్ మొత్తం మారిపోనున్నాయి. కనీవినీ ఎరుగని విధంగా బాహుబలి స్పూఫ్ ఫన్నీగా ఉంటుందని కృతి సనన్ తెలిపింది.


Click it and Unblock the Notifications











