‘రామ్ సేతు’ అప్డేట్.. అక్షయ్‌తో లైకా భారీ ప్లాన్
లైకా ప్రొడక్షన్ కంపెనీ గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే లైకా..స్టార్ హీరోలతో వరుసగా చిత్రాలను తెరకెక్కిస్తూ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టేసింది. శంకర్, ఏఆర్ మురుగదాస్ వంటి ఇండియన్ డైరెక్టర్లతో ఎన్నో చిత్రాలను తెరెక్కించింది. విజయ్, రజనీ, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించింది.
అలాంటి లైకా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో చేతులు కలిపింది. 2 పాయింట్ ఓ సినిమా తరువాత మళ్లీ అంతటి భారీ స్థాయిలో ఓ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. రామసేతు నిజంగా ఉందా? లేదా? అనే అంశం ఎప్పుడూ కూడా వివాదాస్పదంగానే ఉంటుంది. అయితే అలాంటి ఓ పాయింట్ నేపథ్యంలో రామ్ సేతు అనే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు ఈమూవీ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.

ఈ మూవీ షూటింగ్ కోసం అక్షయ్ కుమార్ అయోధ్యలో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. మార్చి 18న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతోన్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ శర్మ తెరకెక్కిస్తున్నాడు. అరుణ భాటియా, లైకా సుభాస్కరణ్, అభుందాతియా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చ పెట్టబోతోన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











