యూపీ సీఎంను కలిసిన అక్షయ్ కుమార్: ‘రామ్ సేతు’ పైనే ప్రధాన చర్చ

వరుస విజయాలతో దూసుకుపోతూ ఇండియాలోనే బెస్ట్ హీరోగా వెలుగొందుతున్నాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. ప్రతి సినిమాతో ట్రెండ్ సెట్ చేస్తున్న ఆయన.. టాప్ కలెక్షన్లు సాధిస్తూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. అంతేకాదు, వ్యక్తిగతగానూ ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న సినీ ప్రముఖుడిగా ఘనత సాధించాడు. సినిమా సినిమాకూ వేరియేషన్ చూపించడంతో పాటు కథకు ప్రాధాన్యం ఇస్తూ సక్సెస్ అవుతోన్నాడు అక్షయ్. ఈ క్రమంలోనే వరుసగా మూవీలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

లాక్‌డౌన్ సమయంలోనూ వరుసగా సినిమాలను ఓకే చేసిన అక్షయ్ కుమార్.. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యాడు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ముంబై చేరుకున్న ఆయనను అక్షయ్ కుమార్ సహా పలువురు సినీ ప్రముఖులు కలిశారు. ఈ సందర్భంగా త్వరలో తాను చేయనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'రామ్ సేతు' మూవీ గురించి సీఎంతో చర్చించాడీ స్టార్ హీరో. 'రామ్ సేతు' మూవీని అభిషేక్ శర్మ డైరెక్ట్ చేయనుండగా, అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియాతోపాటు విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.

Akshay Kumar met UP CM Yogi Adityanath for Ram Setu Movie

ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్ జిల్లా గ్రేటర్ నోయిడా నగరంలో దేశంలోనే అతి పెద్ద ఫిలిం సిటీ నిర్మించబోతున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఏడాది సెప్టెంబరులో ప్రకటించారు. ఈ భేటీలో దీనికి సంబంధించిన వివరాలను సీఎం.. సినీ ప్రముఖులకు వెల్లడించారు. దీనిపై వాళ్లంతా ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదిలా ఉండగా, ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన 'లక్ష్మీ' (కాంచన రీమేక్) హాట్‌స్టార్ యాప్‌లో విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అతడు 'సూర్యవంశీ', 'బెల్ బాటమ్', 'పృథ్వీ రాజ్' అనే సినిమాలు చేస్తున్నాడు. వీటిలో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X