Raksha Bandhan Twitter Review: అక్షయ్ మూవీ అలాంటి టాక్.. చిరంజీవి మూవీలా.. పెద్ద మైనస్ ఏంటంటే!
దాదాపు దశాబ్ద కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఇండియాలోనే టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. ప్రతి సినిమాతో ట్రెండ్ సెట్ చేస్తున్న ఆయన.. టాప్ కలెక్షన్లు సాధిస్తూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. అంతేకాదు, సినిమా సినిమాకూ వేరియేషన్ చూపించడంతో పాటు కథకు ప్రాధాన్యం ఇస్తూ సక్సెస్ అవుతోన్నాడు. అదే సమయంలో వరుసగా మూవీలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక, సరైన భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న అక్షయ్.. తాజాగా 'రక్షా బంధన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది అనేది చూద్దాం పదండి!

రక్షా బంధన్‌తో వచ్చిన స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రమే 'రక్షా బంధన్'. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించి తెరకెక్కించిన ఈ సినిమాకు జీ స్టూడియోస్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఇందులో భూమి పడ్నేకర్ హీరోయిన్‌గా నటించగా.. సదీయా ఖతీబ్, సహేజ్‌మీన్ కౌర్, దీపికా ఖన్నా, సృతి శ్రీకాంత్ కీలక పాత్రలు చేశారు. ఇషాన్ చబ్రా, హిమేష్ సంగీతాన్ని సమకూర్చారు.

అలాంటి కథ.. సరైన అర్థం చెప్పి
అక్షయ్ కుమార్ కెరీర్‌లోనే సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన చిత్రమే 'రక్షా బంధన్'. నలుగురు చెల్లెల్లు ఉన్న అన్న వాళ్లకు ఎలా పెళ్లి చేశాడు? కట్నం అనేది పెళ్లిల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? పెళ్లిలో అమ్మాయి వాళ్లకి, అబ్బాయి వాళ్లకి ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కించారు. దీంతో ఆరంభంలోనే ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.

బిజినెస్ తగ్గట్లు.. గ్రాండ్‌గా రిలీజ్
అక్షయ్ కుమార్‌కు దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. అందుకే 'రక్షా బంధన్' మూవీ హక్కులకు ఎవరూ ఊహించని రీతిలో పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 100 కోట్లు పైగా బిజినెస్‌ను జరుపుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

రక్ష బంధన్ మూవీకి టాక్ ఏంటి
అక్షయ్ కుమార్ నటించిన 'రక్షా బంధన్' ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. ట్విట్టర్ వేదికగా ఎక్కువ మంది ఈ సినిమా చాలా బాగుందని అంటున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా
'రక్షా బంధన్' మూవీ ఓవరాల్‌గా చూస్తే.. ఫస్టాఫ్ మొత్తం పాత్రలను పరిచయం చేయడానికి, ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ తక్కువ సమయమే తీసుకున్నాడట. ముఖ్యంగా మొదటి భాగం కామెడీతో సాగుతుందట. అయితే, రెండో భాగం మాత్రం ఎంతో ఎమోషనల్‌గా ఉంటుందట. క్లైమాక్స్ మాత్రం చక్కని మెసేజ్‌తో ముగుస్తుందని టాక్.

సినిమాలో ప్లస్... మైనస్‌లు ఇవే
అన్నా చెల్లెలి బంధాన్ని వివరిస్తూ తెరకెక్కిన 'రక్షా బంధన్'ను చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు నటీనటులంతా చక్కగా నటించారట. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్, కామెడీ, ఇంటర్వెల్, ఎమోషన్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు బలాన్నిచ్చాయట. అయితే, కొన్ని సన్నివేశాలు మాత్రం ఎక్కడో చూసిన ఫీలింగ్ రావడం దీనికి మైనస్ అంటున్నారు.

మొత్తంగా మూవీ ఎలా ఉందంటే
ట్విట్టర్ ద్వారా అందిన సమాచారం ప్రకారం.. అక్షయ్ కుమార్ నటించిన 'రక్షా బంధన్' ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. ఇందులో అన్నా, చెల్లెళ్ల అనుబంధాన్ని సందేశాత్మక కథతో చూపించారట. దీంతో ఈ సినిమా ఎంతో ఎమోనల్‌గా సాగుతుందని తెలిసింది. మొత్తంగా ఇది రాఖీ పండుగకు సరైన చిత్రంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చని తెలిసింది.

మనకు మాత్రం చిరంజీవి మూవీ
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రక్షా బంధన్' మూవీ అప్పట్లో చిరంజీవి నటించిన 'హిట్లర్'ను పోలి ఉంటుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులోని చాలా సన్నివేశాలు సౌత్‌లో వచ్చిన చాలా సినిమాల్లో చూపించినట్లే ఉంటాయట. ఇది సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందని చెప్తున్నారు. కానీ, ఉత్తరాది వాళ్లకు మాత్రం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుదట.


Click it and Unblock the Notifications











