నేషనల్ వైడ్‌గా ‘సూర్యవంశీ’ ట్రెండ్.. మార్మోగుతున్న అక్షయ్ కుమార్
ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా అక్షయ్ కుమార్ సూర్యవంశీ సినిమా ట్రెండ్ అవుతుంది. భారీ మల్టీస్టారర్‌గా రాబోతోన్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా అంచనాలున్నాయి. అజయ్ దేవగణ్, రణ్ వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ వంటి తారాగణంతో రాబోతోన్న ఈ మూవీని యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం గతేడాదే రావాల్సింది. కానీ కరోనా, లాక్డౌన్ వంటి వాటి వల్ల వాయిదా పడింది.
సూర్యవంశీ సినిమా కోసం అక్షయ్ కుమార్ చేసిన రియల్ స్టంట్స్ ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్‌లో అక్షయ్ కుమార్ ఇరగదీస్తాడన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అసలే బాలీవుడ్‌కు కాప్ స్టోరీలంటే మక్కువ ఎక్కువ. సింగం (అజయ్ దేవగణ్), సింబా(రణ్ వీర్ సింగ్), రౌడీ రాథోడ్ (అక్షయ్ కుమార్) అంటే మన తెలుగు, తమిళ సినిమాలనుఅక్కడ రీమేక్ చేసుకుంటున్నారు.

అలా ఈసారి ఆముగ్గురూ కలిసి సూర్యవంశీగా రాబోతోన్నారు. కేంద్రం వంద శాతం సీటింగ్ కెపాసిటీని థియేటర్లలో అనుమతించడంతో బాలీవుడ్ సినిమాలు రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నాయి.ఇందులో భాగంగా సూర్యవంశీ సినిమా నుంచి అప్డేట్ రానుంది. అందుకే సూర్యవంశీ సినిమా ట్విట్టర్‌లో జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. అయితే ఏ క్షణాన అయితే అప్డేట్ రావొచ్చు అంటూ అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











