twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒళ్లు గగుర్బొడిచే భీకర యుద్ధం: అక్షయ్ కుమార్ ‘కేసరి’ ట్రైలర్ సూపర్బ్

    |

    21 మంది సిక్కు సైనికులు.. 10 వేల మంది ఆప్ఘనిస్థాన్ ఆక్రమరణదారులపై సారాగర్హి వద్ద జరిపిన భీకరయుద్ధం నేపథ్యంలో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'కేసరి'. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి.

    ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సిఖ్ రెజిమెంట్ లీడర్ హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో కనిపించబోతున్నారు. సిక్కు సోల్జర్ పాత్రలో అక్షయ్ లుక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర కోసం బరువైన టర్బన్(సిక్కు తలపాగా) ధరించి నటించారు. ఆయన భార్య పాత్రలో పరిణీతి చోప్రా నటించారు.

    బ్రిటిష్ వారి హయాంలో ఇండియా, పాకిస్థాన్ కలిసి ఉన్నపుడు పాకిస్థాన్‌లోని సారాగర్హి అనే ప్రాంతంలో 1897 సెప్టెంబర్లో ఈ యుద్ధం జరిగింది. కేవలం 21 మందితో హవల్దార్ ఇషార్ సింగ్ అన్ని వేల మంది దాడిని ఎలా తిప్పికొట్టారు అనేది తెరపై ఆసక్తికరంగా చూపించబోతున్నారు.

    Akshay Kumars Kesari trailer released

    అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిగా, ధర్మ ప్రొడక్షన్స్ బేనర్లో కరణ్ జోహార్‌తో కలిసి అరుణ్ భాటియా, హిరూ యశ్ జోహార్, అపూర్వ మెహతా, సునీర్ ఖేటర్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జటిందర్ సా సంగీతం అందిస్తున్నారు. మార్చిన 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Kesari Official Trailer released. Kesari is an unbelievable true story based on the Battle of Saragarhi, 1897. Touted as one of the bravest battle ever fought, 21 courageous Sikhs countered 10,000 invadeers. These saffron clad warriors fought valiantly against all odds and changed the meaning of bravery. This Holi, celebrate the spirit of bravery & sacrifice with Kesari.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X