లక్ష్మీబాంబ్ పేలింది.. అక్షయ్ కుమార్ క్రేజీగా... బాంబు లాంటి స్టోరి అంటూ పోస్ట్
Recommended Video
సామాజిక అంశాల ఆధారంగా వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న అక్షయ్ కుమార్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. తెలుగు, తమిళంలో రిలీజైన కాంచన సినిమా ఆధారంగా రూపొందుతున్నది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముంబైలో నిరాడంబరంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి లారెన్స్ రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అక్షయ్ కుమార్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ లుక్‌కు మంచి స్పందన లభిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

బాంబు లాంటి స్టోరితో
కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్ సినిమా గురించి మీకు ఓ విషయం చెప్పదలుచుకొన్నాను. బాంబు లాంటి స్టోరిని మీ ముందుకు తీసుకు వస్తున్నాను. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నేను కలిసి నటిస్తున్నాం. 2020 జూన్ 5వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాం. ఫాక్స్ స్టార్ స్టూడియో ఈ సినిమాను సమర్పిస్తున్నది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్, తుషార్ ఎంటర్‌టైన్‌మెంట్ హౌస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి అని అక్షయ్ కుమార్ వెల్లడించారు.

కళ్లకు కాటుకతో ఖిలాడీ అక్షయ్
లక్ష్మీబాంబ్ చిత్రంలో కంటికి కాటుక పెట్టుకొంటున్నట్టు ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అక్షయ్ షేర్ చేసిన ఫస్ట్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్‌పై అభిమానులు, నెటిజన్లు క్రేజీగా స్పందిస్తున్నారు. విభిన్నమైన పాత్రలో ఆకట్టుకునేలా ఉన్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

లక్ష్మీబాంబ్‌లో కియారా అద్వానీ
లక్ష్మీబాంబ్ సినిమా గురించి కియారా అద్వానీ కూడా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. బాలీవుడ్‌లో కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్‌లో నటిస్తున్నాను. అక్షయ్ కుమార్‌తో మరోసారి జతకడుతున్నాను. ఈ సినిమా జూన్ 5, 2020లో విడుదలవుతుంది అని కియారా అద్వానీ తన ఇన్స్‌టాగ్రామ్‌లో తెలిపారు.

ట్రాన్స్‌జెండర్‌గా అమితాబ్ బచ్చన్
లక్ష్మీ బాంబ్ చిత్రంలో ట్రాన్స్‌జెండర్‌గా బిగ్‌బీ అమితాబ్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ, తెలుగు వెర్షన్లలో ఈ పాత్రను శరత్ కుమార్ పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమితాబ్‌తో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా అమితాబ్ రోల్ గురించి వెల్లడిస్తామని చెప్పారు.

రాఘవ లారెన్స్ తొలిసారి బాలీవుడ్‌లోకి
కాంచన చిత్రానికి దర్శకత్వం వహించిన లారెన్స్ రాఘవ తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్, షాబీనా ఖాన్ నిర్మిస్తున్నారు. హౌస్‌ఫుల్ 4 డైరెక్టర్ పర్హాద్ సమ్జి హిందీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. ఇంకా ఈ చిత్రంలో ఆర్ మాధవన్, శోభితా ధూళిపాళ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











