భయపెట్టిన అక్షయ్ కుమార్.. 'లక్ష్మీ బాంబ్' వేసేశాడు
రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి తానే లీడ్ రోల్‌లో నటించిన సినిమా కాంచన. హారర్ కామెడీ సినిమాగా వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ సిరీస్ నుంచి నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
అయితే ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలు చూసి ఇంప్రెస్ అయిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. హిందీలో కాంచన రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు తానే నిర్మాతగా మారి 'లక్ష్మీ బాంబ్' అనే టైటిల్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. లారెన్స్ దర్శకత్వం లోనే తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.

ఇప్పటికే ఫస్ట్‌లుక్ విడుదల చేసి ఆసక్తి రేకెత్తించిన చిత్రయూనిట్.. తాజాగా అక్షయ్ కుమార్ హిజ్రా గెటప్‌లో ఉన్న మరో స్టిల్ విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. కాళీ మాత గుడిలో ఎర్ర చీర ధరించి, ముఖాన పెద్ద బొట్టుతో ఉన్న అక్షయ్ లుక్ భయపెట్టేలా ఉండి.. ప్రేక్షకుల్లో 'లక్ష్మీ బాంబ్' సినిమాపై ఆతృతను పెంచేసింది. ఇక ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన కియారా అద్వానీ జోడీ కడుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











