హాస్పిటల్‌కు ట్వింకిల్ ఖన్నా.. మాస్క్‌తో స్వయంగా కారు నడుపుకుంటూ అక్షయ్ (వీడియో)

ప్రధాన మంత్రి నిధికి రూ.25 కోట్లు విరాళం ప్రకటించి వార్తల్లో నిలిచిన అక్షయ్ కుమార్ ఓ సెలబ్రిటీగా కాకుండా ఓ సామాన్యుడిలా భార్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఘటన ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలో కరోనా భయాలు ఎక్కువగా ఉన్న సమయంలో సతీమణి ట్వింకిల్ ఖన్నాకు జాగ్రత్తగా ఆస్పత్రిలో దగ్గురిండి చికిత్స చేసిన వైనం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకొంటున్నది. వివరాల్లోకి వెళితే..

సోషల్ డిస్టెన్స్ నుంచి బయటకు

సోషల్ డిస్టెన్స్ నుంచి బయటకు

ప్రధాని పిలుపుతో అక్షయ్ కుమార్ స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లిపోయాడు. సోషల్ డిస్టెన్స్‌ను చక్కగా అమలు చేస్తున్నాడు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించి అక్షయ్ కుమార్ స్వయంగా కారు నడుపుకుంటూ బయటకు వచ్చాడు. తన భార్యను పక్కనే కూర్చో బెట్టుకొని హాస్పిటల్‌కు బయలుదేరారు.

కాలికి గాయం కావడంతో

కాలికి గాయం కావడంతో

అయితే ట్వింకిల్ ఖాన్నాకు కరోనావైరస్ సోకిందా అనే అనుమానాలు కాదంటి.. గత కొద్ది రోజుల క్రితం ఆమె కాలుకు తీవ్రమైన గాయం అయింది. కాలుకు బ్యాండేజ్ వేశారు. ఆదివారం రోజున ఆమెకు డ్రెస్సింగ్ చేయాల్సి ఉండటంతో స్వయంగా అక్షయ్ కుమార్ భార్యను వెంటపెట్టుకొని హాస్పిటల్‌కు వెళ్లాడు.

ట్వింకిల్ ఖన్నా వీడియో

కారులో ప్రయాణిస్తున్న సమయంలో ట్వింకిల్ ఖన్నా వీడియో తీసి తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించడంతో ముంబై రోడ్లన్నీ ఎడారులుగా మారిపోయాయి. ఎప్పుడు వాహనాలతో కిక్కిరిసిపోయి కనిపించే రోడ్ల మీద పావురాలు, కాకులు కనిపిస్తున్నాయి. నాకేదో ప్రమాదం ముంచుకొచ్చిందని భావించవద్దు. అలా నేను కలలో కూడా అనుకోను అని ట్వింకిల్ ఇన్స్‌టాలో పోస్టు పెట్టారు.

25 కోట్ల విరాళం

25 కోట్ల విరాళం

తాజాగా కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో బాధితులను ఆదుకోవడానికి విరాళాలు అందించండని ప్రధాని మోదీ పిలుపుకు అక్షయ్ కుమార్ స్పందించి 25 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. మిగితా బాలీవుడ్ ప్రముఖులకు, దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులకు స్ఫూరిగా నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X