ఒళ్లు గగుర్బొడిచేలా అక్షయ్ కుమార్ యాక్షన్ స్టంట్: హెలికాప్టర్‌కు వేలాడుతూ...
బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన అక్షయ్ కుమార్ యాక్షన్ సీన్లు డూప్ లేకుండా చేయడానికే ఇష్టపడతారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'సూర్యవంశీ' అనే చిత్రం చేస్తున్న ఈ బాలీవుడ్ ఖిలాడి ఒళ్లు గగుర్బొడిచే స్టంట్స్ చేసి అభిమానులను ఆశ్చర్య పరిచాడు. అందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.
అక్షయ్ ఎలాంటి డూప్ లేకుండా హెలికాప్టర్‌కు వేలాడుతూ చేజింగ్ సీన్లలో నటించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. రోహిత్ శెట్టి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నింటినీ మించి పోయేలా ఈ చిత్రంలో యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

నటన ప్రారంభించిన రోజు నుంచే యాక్షన్ సన్నివేశాలు చేయడం మొదలు పెట్టాను. అవి నా జీవితంలో భాగం అయిపోయాయి. 'సూర్యవంశీ' చిత్రంలో చేసిన ప్యూర్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను మంచి వినోదాన్ని, విభిన్నమైన అనుభూతి పంచుతాయని అక్షయ్ కుమార్ వెల్లడించారు.
'సూర్యవంశీ' మూవీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో సాగుతుంది. ఇందులో అక్షయ్ కుమార్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అక్షయ్ కుమార్ ఫన్నీ అండ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











