పూజా హెగ్డే డైరెక్టర్ ఇంత నీచుడా.. అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం!
Recommended Video

మీటూ ఉద్యమం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్శకులు, నటులు, నిర్మాతలు, బడా సెలబ్రిటీల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులంతా మీటూ ఉద్యమం ద్వారా తాము ఎదుర్కొన్న దారుణాలని బయటపెడుతున్నారు. ఏక్షణాన ఎవరి పేరు బయటపడుతుందో అని నటీమణులని వేధించినవారు లోలోపలే వణికి పోతున్నారు. అంతగా మీటూ ఉద్యమం ప్రభావం చూపింది. ప్రముఖ నటి సలోని చోప్రా ఇటీవల బాలీవడ్ దర్శకుడు షాజిద్ ఖాన్ చేసిన దారుణాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

మరో దర్శకుడు
ఇప్పటికే నానా పాటేకర్, వికాస్ బహల్, సుభాష్ కపూర్ వంటి ప్రముఖులు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ జాబితాలో దర్శకుడు షాజిద్ ఖాన్ పేరు కూడా చేరింది. సలోని చోప్రా చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్ అంతటా చర్చ జరుగుతోంది. తనతో షాజిద్ ఖాన్ నీచాతి నీచంగా ప్రవర్తించాడని సలోని తెలిపింది.

సెగ తగిలింది
సలోని చోప్రా వ్యాఖ్యలతో మీటూ ఉద్యమ సెగ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కి కూడా తగిలింది. అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం హౌస్ ఫుల్ 4 ఈ చిత్రానికి షాజిద్ కపూర్ దర్శకుడు. కృతి సనన్, కృతి కర్బందా, టాలీవుడ్ నయా సంచలనం పూజ హెగ్డే ఈ చిత్రంలో నటిస్తున్నారు.
సంచలన నిర్ణయం
హౌస్ ఫుల్ 4 చిత్రంపై తాజగా అక్షయ్ కుమార్ సంచలన ప్రకటన చేశాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చాక ఈ వార్త విన్నా. ఈ వార్తలు చాలా వేదన కలిగించాయి. విచారణ జరిగే వరకు హౌస్ ఫుల్ 4 చిత్ర షూటింగ్ రద్దు చేయాలనీ నిర్మాతలని కోరుతున్నట్లు అక్షయ్ కుమార్ ప్రకటించాడు.

అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ బాటలోనే
ఇలాంటి నిర్ణయం ఇప్పటికే అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ తీసుకున్నారు. అమీర్ ఖాన్ నటిస్తున్న మొఘల్ చిత్ర దర్శకుడు సుభాష్ కపూర్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. దీనితో తాను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు అమీర్ ప్రకటించాడు. సూపర్ 30 చిత్ర దరకుడు వికాస్ బహల్ పై కూడా లైంగిక ఆరోపణలు రావడంతో హృతిక్ రోషన్ తన నిర్మాతలని విచారణ కోసం ఆదేశించాడు.

నిలదీసిన తనుశ్రీ దత్త
తనుశ్రీ దత్త నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నానా పాటేకర్ కూడా హౌస్ ఫుల్ 4 చిత్రంలో నటిస్తున్నాడు. తనుశ్రీ ఆరోపణలు చేసిన సమయంలో అక్షయ్ కుమార్ స్పందించలేదు. ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా తనుశ్రీకు మద్దత్తు ప్రకటించింది. నీ భర్త నానా పాటేకర్ తో కలసి నటిస్తున్నాడు. ఇక నీ మద్దత్తులో నిజాయతీ ఏముంటుంది అని ట్వింకిల్ ఖన్నాని తనుశ్రీ నిలదీసిన సంగతి తెలిసిందే.
తేలేవరకు కదిలేది లేదు
ఇప్పుడు హౌస్ ఫుల్ 4 చిత్ర దర్శకుడు షాజిద్ ఖాన్ పై కూడా ఆరోపణలు రావడంతో ట్వింకిల్ ఖన్నా స్పందించారు. వరుసగా ఇలాంటి సంఘటనల గురించి వింటుంటే భయం వేస్తోంది. హౌస్ ఫుల్ 4 చిత్రంలో నటిస్తున్న వారంతా ఒక్కతాటిపైకి రావాలి. ఈ ఆరోపణల గురించి తేలేవరకు షూటింగ్ జరగకూడదని కోరింది.


Click it and Unblock the Notifications











