ఆ హీరో గే.. కావాలంటే సహజీవనం చేయమని మా అమ్మ చెప్పింది: ట్వింకిల్ ఖన్నా

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ వెండితెరపైన మంచి సందేశాత్మక చిత్రాలు అందించడంలో ముందుటాడు. కమర్షియల్ సినిమలైనా.. రియల్ లైఫ్ స్టోరీస్ అయినా తనదైన శైలిలో అందరిని మెప్పించేలా ప్రెజెంట్ చేయడం అక్షయ్ కి ఉన్న స్పెషల్ టాలెంట్. అయితే ఇటీవల ఈ హీరో భార్య ట్వింకిల్ ఖన్నా ఎవరు ఊహించని విధంగా అక్షయ్ పై వచ్చిన 'గే' రూమర్స్ గురించి ఊహించని విధంగా స్పందించింది.

బెస్ట్ లవ్ స్టోరీ..

బెస్ట్ లవ్ స్టోరీ..

అక్షయ్ కుమార్ - ట్వింకిల్ ఖన్నాలు ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో ఎవరు అంతగా పసిగట్టలేకపోయారు. వారి ప్రేమ వ్యవహారాలు చాలా రోజుల తరువాత బయటపడ్డాయి. మొత్తానికి 2001లో పెళ్లితో మరింత దగ్గరైన ఈ జంట బెస్ట్ లవ్ బర్డ్స్ గా సినీ ప్రముఖుల నుంచి కామెంట్స్ అందుకున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా వివాదాలకు రూమర్స్ కి తావివ్వకుండా బెస్ట్ లవ్ స్టోరీని నడిపించారు.

స్వీట్ ట్వింకిల్..

స్వీట్ ట్వింకిల్..

ట్వింకిల్ ఖన్నా అంటే స్వీట్ గర్ల్ అని బాలీవుడ్ సినీ ప్రముఖులు చెబుతుంటారు. కానీ ఆమె అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ తో జనాలకు షాకిస్తుంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం తప్పేమీ కాకపోయినా కొన్ని విషయాలను మరీ బోల్డ్ గా చెప్పడంతో కాంట్రవర్సీగా మారుతుంది. అలాగే ట్వింకిల్ చేసే వ్యాఖ్యలు కూడా అక్షయ్ ని పలుమార్లు తలపట్టుకునేలా చేశాయని రూమర్స్ వచ్చాయి.

అక్షయ్ కుమార్ గే అన్నారు..

అక్షయ్ కుమార్ గే అన్నారు..

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్వింకిల్ తన భర్తపై వచ్చిన ఒక కామెంట్ గురించి వివరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. అక్షయ్ కుమార్ నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు మా అమ్మ (డింపుల్ కపాడియా) దగ్గరకు వెళ్లి విషయం చెప్పాను. అయితే అక్షయ్ గే అని మా అమ్మ అనుమానం వ్యక్తం చేసింది. ఎవరు ఊహించని విధంగా నాకు ఆమె ఒక సలహా కూడా ఇచ్చారు.

Recommended Video

Shraddha Kapoor Thinking About Telugu Offers After Saaho Result
అతనితో డేటింగ్ చెయ్..

అతనితో డేటింగ్ చెయ్..

మా అమ్మ అలా చెప్పగానే షాక్ అయ్యాను. కావాలంటే అతనితో సహా జీవనం చేయమని ఒక సలహా ఇచ్చింది. డేటింగ్ చేసిన కొన్నాళ్ల తరువాత అతను కరెక్ట్ అని తెలిస్తే పెళ్లి చేసుకొమ్మని తల్లి డింపుల్ కపాడియా తెలిపినట్లు ట్వింకిల్ ఖన్నా వివరణ ఇచ్చింది. అనంతరం అక్షయ్ తో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నట్లు చెబుతూ.. అన్నిటికంటే అతనిలో మంచి తనమే నాకు బాగా నచ్చింది అని ట్వింకిల్ ఖన్నా వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X