ఇండస్ట్రీలో చిచ్చు రేపిన రిలీజ్ డేట్: ‘తెలుగు’ సినిమాకు బాలీవుడ్‌లో కష్టాలు
క్రికెట్ నేపథ్యంతో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన చిత్రం 'జెర్సీ'. వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న నేచురల్ స్టార్ నానిని మరోసారి నిలబడేలా చేసిందీ సినిమా. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసి అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో దీన్ని తమ తమ భాషల్లోకి రీమేక్ చేయడానికి ఎంతో మంది దర్శక నిర్మాతలు టాలీవుడ్‌కు క్యూ కట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీలోని బడా ప్రొడ్యూసర్లు దిల్ రాజు, అల్లు అరవింద్ రైట్స్ కొనుగోలు చేసి ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న హిందీ 'జెర్సీ'లో బాలీవుడ్ స్టార్ హీరో షాహీద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. మాతృకను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దీన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం షాహీద్ కపూర్ కూడా చాలా కష్ట పడుతున్నాడు. ఒకానొక సమయంలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ గాయ పడ్డాడు కూడా. ఇక, ఈ సినిమాను నవంబర్ 5, 2021న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు 'పృథ్వీరాజ్' నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'పృథ్వీరాజ్'. చంద్ర శేఖర్ ద్వివేదీ, జీల్ థక్కర్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. సంజయ్ దత్, సోనూ సూద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక, ఈ సినిమాను కూడా నవంబర్ 5నే విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీంతో 'జెర్సీ' టీమ్ దీనిపై ఆగ్రహంగా ఉంది. అంతేకాదు, షాహీద్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అక్షయ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇక, దీనిపై తెలుగు నిర్మాతలు స్పందించబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











