బాలీవుడ్‌లో కరోనా ప్రకంపనలు.. ఒకే షూటింగులో 45 మందికి కోవిడ్19.. మరో ఇద్దరు యువ హీరో, హీరోయిన్లు!
మహారాష్ట్రనే కాకుండా బాలీవుడ్ పరిశ్రమను కరోనావైరస్ గజగజ వణికిస్తున్నది. ఇటీవల ప్రముఖ తారలందరూ కోవిడ్19 పాజిటివ్ బారిన పడటంతో సినీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నారు. బాలీవుడ్ చిత్రం పరిశ్రమలో రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఓ ఫిలిం షూటింగులో 45 మందికి కరోనావైరస్ సోకడం ఆసక్తిగా మారింది. బాలీవుడ్‌కు సంబంధించిన కరోనావైరస్ అప్‌డేట్ వివరాల్లోకి వెళితే...

అక్షయ్ కుమార్‌కు కోవిడ్
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కరోనావైరస్ బారిన పడ్డారనే విషయం దిగ్బ్రాంతికి గురిచేసింది. తనకు కోవిడ్ 19 సోకిందనే విషయాన్ని స్వయంగా ఆయన వెల్లడించారు. మెడికల్ బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కరోనావైరస్ సోకిన మరుసటి రోజే పోవైలోని హిరంనందానీ హాస్పిటల్‌లో చేరారు.

విక్కి కౌశల్ కరోనావైరస్
తాజాగా బాలీవుడ్ యువతారలు భూమి పడ్నేకర్, విక్కి కౌశల్ కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనావైరస్ అనే విషయంపై విక్కి కౌశల్ స్పందిస్తూ.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొన్న తర్వాత కూడా దురదృష్టవశాత్తూ కరోనావైరస్ పాజిటివ్ అని తేలిందని ట్వీట్ చేశారు.

భూమి పడ్నేకర్ కోవిడ్ పాజిటివ్
అలాగే భూమి పడ్నేకర్ కూడా తనకు కోవిడ్ పాజిటివ్ అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. స్వల్ప అస్వస్థత తర్వాత పరీక్షలు చేయించుకోగా నాకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. స్వల్పంగా లక్షణాలు ఉన్నాయి. డాక్టర్లు, ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాను అని పేర్కొన్నారు.

రామసేతు టీమ్‌లో 45 మందికి కరోనా
ఇదిలా ఉండగా, అక్షయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత ఆయన నటిస్తున్న రామ్‌సేతు సినిమా సెట్‌ను మరోచోటకు తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో షూటింగులో 100 మందికి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. వారిలో 45 మందికి కరోనావైరస్ పాజటివ్ అని తేలింది.

బాలీవుడ్‌లో దురదృష్టకరమైన పరిస్థితులు
బాలీవుడ్‌లో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ స్పందించింది. ఆ సంస్థ అధ్యక్షుడు బీఎన్ తివారీ మాట్లాడుతూ.. హిందీ చిత్ర పరిశ్రమలో సినీ ప్రముఖులందరూ కరోనా బారిన పడట దురదృష్టకరం. అక్షయ్ కుమార్ చిత్రంలో నటించే వారిలో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువగా కోవిడ్ 19కు గురయ్యారు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











