2.0లో అవతారం చూసి అక్షయ్ కుమార్ చిన్నారి కూతురు ఏమందో తెలుసా?
రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 2.0 మూవీ ఇటీవల విడుదలైన బాక్సాఫీసు వద్ద వసూళ్ల పరంగా అదరగొట్టడం మాత్రమే కాదు...సూపర్ హిట్ మౌత్ టాక్‌తో దూసుకెళుతోంది. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ప్లాప్ టాక్ రావడంతో వెలవెల పోయిన ఉత్తరాది థియేటర్లు 2.0 వల్ల కళకళలాడుతున్నాయి.
కాగా.. తన తండ్రి నటించిన 2.0 చిత్రాన్ని చూడటానికి అక్షయ్ కుమార్ ఆరేళ్ల కూతురు నితారా ఆసక్తిగా ఎదురు చూస్తోందట. సినిమా ప్రోషన్స్ పోస్టర్స్ చూసిన నితారా..... డాడీ 'బర్డ్ మ్యాన్' అంటూ మరిసిపోతోందట.

ఆరేళ్ల చిన్నారి కావడంతో ఈ సినిమాను ఇంకా ఆమెకు చూపించలేదు. సినిమాలోని కొన్ని సీన్లు చూసి భయపడే అవకాశం ఉన్నందున ఎడిటెడ్ వెర్షన్ ఇంట్లోనే చూపిస్తారని తెలుస్తోంది. బర్డ్ మ్యాన్‌గా డాడీని తెరపై చూసిన తర్వాత నితారా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
కాగా.. 2.0 చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ రూ. 400 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ 5 రోజుతో రూ. 100 కోట్ల మార్కును క్రాస్ అయిం రూ. 111 కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్స్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ శని, ఆదివారాల్లో బిజినెస్ పుంజుకుంది. పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో సినిమాపై నమ్మకం మరింత పెరిగింది.


Click it and Unblock the Notifications











