అక్కడ కాంచన క్లిక్కయితే.. అక్షయ్ మరో లక్ష్మీ బాంబ్ కూడా సిద్ధం చేస్తాడట?
ఇండియన్ స్టార్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరైన రాఘవ లారెన్స్ దర్శకుడిగా కూడా టాప్ లిస్ట్ లో చేరాడు. ఎక్కువగా హారర్ లో కామెడీ మిక్స్ చేసి సరికొత్త థ్రిల్ ఇవ్వడంలో తన ప్రత్యేకతను చాటుకుంటాడు. ముని నుంచి మొదలైన లారెన్స్ టెక్నీక్ ప్రతిసారి వర్కౌట్ అవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల బాలీవుడ్ సైడ్ కూడా తన డైరెక్షన్ టాలెంట్ ని చూపించాలని రాఘవ సిద్ధమైన విషయం తెలిసిందే.
అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న లక్ష్మీ బాంబ్ సినిమా కాంచన సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సగానికిపైగా అయిపోయాయి.

ఇక మిగిలిన పని కూడా లాక్ డౌన్ అనంతరం వెంటనే ఫినిష్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే పలుమార్లు సినిమా అవుట్ పూట్ పై లుక్కేసిన అక్షయ్ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ముందుగానే ఒక ఆఫర్ ఇచ్చారట.
కాంచన సినిమా హిట్టయితే.. వెంటనే మరొక సినిమా చేద్దామని లారెన్స్ తో అక్షయ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ముని సిరీస్ అంటూ.. మరొక సిరీస్ తో వస్తారా లేక అక్షయ్ కుమార్ క్రేజ్ కి తగ్గట్లు మరీంత డిఫరెంట్ సినిమాతో వస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అలాగే లారెన్స్ హీరోగా మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. చంద్రముఖి 3 ప్రాజెక్ట్ లో కూడా లారెన్స్ కథానాయకుడిగా అలరించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











