ఆవుమూత్రం తాగుతాను.. అందుకే వేరే జంతువుది కూడా తాగాను.. స్టార్ హీరో షాకింగ్ ఆన్సర్
స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎలాంటి సమాధానం చెప్పినా కూడా చాలా పదునుగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. అతను నటుడిగా ఎంత క్రేజ్ అందుకున్న కూడా ఒక బాధ్యత గల భారతీయుడిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సినిమాల్లో కూడా వీలైనంత వరకు సందేశం ఉండేలా చూసుకుంటాడు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాన్ని బహిరంగంగా చెప్పడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదని టాయిలెట్, ప్యాడ్ మ్యాన్ వంటి సినిమాలను అర్థమయ్యేలా చూపించాడు.

ఎలాంటి విపత్తులు వచ్చినా..
దేశంలో ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా అంధరికంటే ముందుగా బాలీవుడ్ లో వెంటనే స్పందించే వారిలో అక్షయ్ కుమార్ ఒకరు. అలాగే ఆర్థిక సహాయాన్ని, విరాళాలు అందించడంలో కూడా అక్షయ్ కుమార్ ముందుంటాడు. ఇక చాలా రోజుల తరువాత అక్షయ్ కుమార్ ఒక వైల్డ్ లైఫ్ షోతో సరికొత్తగా ఆకట్టుకోబోతున్నాడు.

వైల్డ్ లైఫ్ అడ్వెంచర్..
వైల్డ్ లైఫ్ హీరో బేర్ గ్రిల్స్ ఇటీవల అక్షయ్ కుమార్ తో 'ఇంటు ది వైల్డ్' అడ్వెంచర్ షోని పవర్ఫుల్ గా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి డిస్కవరీలో ఆ షో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్, బేర్ గ్రిల్స్.. సహనటుడు హుమా ఖురేషితో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్ పాల్గొన్నాడు. బేర్ కర్ణాటకలోని బండిపూర్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ వద్ద 'ఇంటు ది వైల్డ్' ప్రత్యేక ఎపిసోడ్ షూటింగ్ గురించి వీరు మాట్లాడుకున్నారు.

ఏనుగు పూప్ టీ ఈజిగానే తాగాను..
ఈ అడ్వెంచర్ లైఫ్ లో బేర్ గ్రిల్స్ కి ఎంతో అనుభవం ఉంది. ఎలాంటి కఠినమైన నిర్వర్ణయాలైనా తీసుకుంటాడు. ఆయనతో కలిసి "ఏనుగు పూప్ టీ" కూడా తాగారు. ఆ అనుభవం ఎలా ఉందని హుమా వారిని అడిగినప్పుడు.. తనకు అది పెద్ద సమస్యగా ఇబ్బంది కలిగించలేదని అక్షయ్ తెలిపారు.
Recommended Video

ఆవుమూత్రం అలవాటు
దానికి కారణం నేను ప్రతిరోజూ ఆయుర్వేద కారణాల వల్ల ఆవు మూత్రం తాగుతాను. అందువల్ల అది నిజంగా ఇబ్బందిగా ఏమి అనిపించలేదు అని అక్షయ్ తెలిపిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే అవు మూత్రం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా తెలిపారు. ఇక అక్షయ్ కుమార్ హిందు ధర్మాలకు విలువను ఇచ్చిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











