twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల వైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్.. స్టార్ హీరోలకు పోటీగా కుర్ర హీరో!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సినిమా అల..వైకుంఠపురములో. ఈ ఏడాది సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను ఇతర ఇండస్ట్రీలో రీమేక్ చేసేందుకు స్టార్ హీరోలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతవరకు రీమేక్ పై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక రీమేక్ లిస్ట్ లో మరో కుర్ర హీరో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Ala Vaikunthapurramuloo Bollywood Remake,Star Hero Showing Intrest!
    బన్నీ బౌన్స్ బ్యాక్..

    బన్నీ బౌన్స్ బ్యాక్..

    వరుస డిజాస్టర్స్ తో సతమతమైన అల్లు అర్జున్ కి అల.. వైకుంఠపురములో మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. మరోవైపు త్రివిక్రమ్ కూడా గత సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఎలాగైనా సక్సెస్ కావాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. చాలా వరకు అల.. వైకుంఠపురములో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది.

    హిందీలో రీమేక్..

    హిందీలో రీమేక్..

    టాలీవుడ్ సంక్రాంతి హిట్ అని తెలియగానే బాలీవుడ్ హీరోలు అల..వైకుంఠపురములో సినిమా గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. కొందరైతే సినిమాను స్పెషల్ షో వేసుకొని మరి చూశారు. బాలీవుడ్ బడా నిర్మాతలు దర్శకులకు ఈ సినిమా బాగా నచ్చేసింది. సరైన కాంబినేషన్ సెట్టయిన తరువాత సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

    గట్టిగానే ట్రై చేస్తున్నారు..

    గట్టిగానే ట్రై చేస్తున్నారు..

    అల..వైకుంఠపురములో సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరోలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ తో పాటు షాహిద్ కపూర్ కూడా ఆ సినిమాను హిందీలో తెరకెక్కించాలని ట్రై చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల అక్షయ్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయాన్ని కొంచెం పక్కనపెట్టేశాడట. ఇక షాహిద్ కపూర్ ఇప్పటికే అర్జున్ రెడ్డి, జెర్సీ సినిమాలు చేయడంతో మూడవసారి కూడా తెలుగు సినిమా కరెక్ట్ కాదని ఆ ఆలోచనను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

    మరో కుర్ర హీరో..

    మరో కుర్ర హీరో..

    ఇక ఇప్పుడిపుడే బాలీవుడ్ లో క్రేజ్ పెంచుకుంటున్న యువ హీరో కార్తిక్ ఆర్యన్ అల.. వైకుంఠపురములో కథపై మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సినిమాను చూసిన ఈ కుర్ర హీరో ఎలాగైనా ఆ సినిమాను రీమేక్ చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట. ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. లాక్ డౌన్ అనంతరం ఆ సినిమాను కొంతమంది దర్శకనిర్మాతలకు చూపించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పాడు.

    English summary
    Box office hit movie Ala Vaikunthapuramlo is one of the top 5 biggest hits in the history of Telugu cinema. The film took actors to new heights in his career and made director Trvikram an even bigger director. Now the crazy report going on in north circles is that none other than kartik aaryan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X