అలియా భట్, ఆమె తల్లి భారతీయులను దుర్భాషలాడుతున్నారు: కంగనా రనౌత్ సోదరి ఫైర్!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ... యంగ్ హీరోయిన్ అలియా భట్, ఆమె తల్లి సోనీ రజ్దాన్ మీద విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు. నాన్ ఇండియన్స్ అయిన వీరు భారతదేశ ప్రజలను దుర్భాషలాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ ఇటీవల జునైద్ ఖాన్ అనే యువకుడి గరించి ట్వీట్ చేస్తూ 'జునైద్ ముస్లిం కావడం వల్లే ట్రైన్లో ఒక గుంపుచే చంపబడ్డాడు' అని ట్వీట్ చేశారు. ''జునైద్ విషయంలో సోనీ రజ్దాన్ చేసిన ఆరోపణలు నిజం కాదు, ఆమె బ్రిటిష్ పాస్ పోర్ట్ కలిసిగిన వ్యక్తి, అందుకే భారతీయులపై ఇలాంటి నింద వేస్తోంది'' అంటూ ప్రచురితమైన ఓ ఆర్టికల్ ఈ సందర్భంగా రంగోలీ షేర్ చేశారు.

భారతీయులు కాని వీరు ఈ గడ్డపై జీవిస్తూ..
‘‘భారతీయులు కాని వీరు ఈ గడ్డపై జీవిస్తూ.. ఇక్కడ ప్రజలను దుర్భషలాడుతూ, ఈ దేశంలో అసహన వాతావరణం ఉందని చెబుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వీరు ఈ సమయంలో ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉంది.'' అంటూ రంగోలీ మండి పడ్డారు.

అయితే రంగోలీ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మరో విధంగా స్పందించారు
ఖేవ్నా ఆనంద్ అనే వ్యక్తి రియాక్ట్ అవుతూ... ‘నీ సోదరి కంగనా రనౌత్ ఏమైనా రణబీర్ కపూర్‌తో ప్రేమలో ఉందా? మీరు అలియా భట్‌ను టార్గెట్ చేయడానికి ఇంతకు మించిన కారణం ఏమీ కనిపించలేదు. గతంలో హృతిక్ రోషన్ విషయంలో కూడా మీరు ఇలాగే ప్రవర్తించారు.' అంటూ మండి పడ్డారు.

అలియా భట్ సక్సెస్ జీర్ణించుకోలేకే
‘ఈ అకౌంట్ రంగోళీ పేరు మీద ఉన్నప్పటికీ దీన్ని కంగనా హ్యాండిల్ చేస్తోంది. అలియా భట్ సక్సెస్ చూసి ఓర్వలేకే ఇలా ఆమెను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తోంది. ఇద్దరూ అక్క చెల్లెళ్లు కలిసి బాలీవుడ్లో పెద్ద గ్యాబ్లింగ్ చేస్తున్నారు' అంటూ మరొక ట్విట్టర్ యూజర్ ఫైర్ అయ్యారు.

కంగనాకు కడుపుమంట
‘ఇతరుల సక్సెస్ చూస్తే మీకు కడుపుమంట. ‘మణికర్ణిక' హిట్ కాలేదు. కానీ ‘రాజీ' బ్లాక్ బస్టర్ అయింది. మీరు ఇద్దరు నిజాయితీగా ఉండటం నేర్చుకోండి. ఇలాంటి ఆరోపణలు మీ లాంటి చదువుకోని వ్యక్తులు మాత్రమే చేస్తారు' అంటూ మరికొందరు మండి పడ్డారు

నువ్వు బీజేపీ మనిషివి
‘‘జునైద్ దారుణంగా చంపబడ్డాడు అనేది వాస్తవం. అతడి వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఈ ప్రభుత్వం స్పెడ్ చేసిన విద్వేశాలే అతడి చావుకు కారణమైంది. నువ్వు బీజేపీ మనిషివి అని మాకు అర్థమైంది.'' మరికొందరు కామెంట్ చేయడం గమనార్హం.

కంగనా, రంగోలికి మద్దతుగా
ఈ ట్వీట్ విషయంలో వీరిని విమర్శించే వారు మాత్రమే కాదు, సపోర్ట్ చేసే వారు కూడా ఉన్నారు. రంగోలీ చేసిన ట్వీట్లో పూర్తి వాస్తవం ఉంది అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా రంగోళీ ట్వీట్ మీద భిన్నవాదనలు వినిపించాయి.


Click it and Unblock the Notifications











