Alia Bhatt: పండంటి పాపకు జన్మనిచ్చిన అలియా భట్ .. రెండు కుటుంబాల్లో ఇదే రిపీట్!

స్టూడెంట్​ ఆఫ్​ ది ఇయర్​ మూవీతో హిందీ చిత్రసీమకు హీరోయిన్​గా పరిచయమైన ముద్దుగుమ్మ అలియా భట్​. ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు మహేశ్ భట్​ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈ క్యూట్​ గుమ్మ 2 స్టేట్స్​, హైవే, డియర్​ జిందగీ, ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీ బాయ్​, కలంక్​ వంటి తదితర సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRR​ సినిమాలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇక తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ ను పెళ్లాడిన రెండు నెలలకే ప్రెగ్నెంట్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా అమ్మాయికి జన్మనిచ్చినట్లు ప్రకటించి ఇటు కపూర్ కుటుంబంలో, అటు అభిమానుల్లో సంతోషాన్ని తీసుకొచ్చింది.

నవంబర్ 28న డెలివరీ డేట్..

నవంబర్ 28న డెలివరీ డేట్..

బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ రణ్ బీర్ కపూర్ అండ్ అలియా భట్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. అలియా భట్ ఇవాళ అంటే నవంబర్ 6 ఆదివారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అలియా భట్ కు మరో క్యూటి అమ్మాయి పుట్టింది. సౌత్ ముంబైలో ఉన్న గిరిగావ్ లోని హెచ్ఎన్ రియలన్స్ ఆసుపత్రిలో అలియా భట్ ప్రసవం జరిగింది.

అయితే ఈ నెలాఖరున అంటే నవంబర్ 28న అలియా భట్ డెలివరీ కావొచ్చని వైద్యులు తెలిపినట్లు ముంబై వర్గాల నుంచి సమాచారం. అయితే వైద్యులు చెప్పిన సమయం కంటే ముందుగానే బిడ్డకు జన్మనిచ్చింది అలియా భట్. దీంతో కపూర్ ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది.

తను అద్భుతమైన అమ్మాయి..

తను అద్భుతమైన అమ్మాయి..

తమకు అమ్మాయి పుట్టినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అలియా భట్. "మా జీవితాల్లోకెల్లా గొప్ప వార్త. మా బేబీ వచ్చేసింది. తను చాలా అద్భుతమైన అమ్మాయి. మేము అధికారికంగా మా ప్రేమను ప్రకటిస్తున్నాం. ప్రేమతో తల్లిదండ్రులు అయ్యాం. లవ్ లవ్ లవ్ అలియా అండ్ రణ్ బీర్" అంటూ ఉన్న మూడు సింహాలు ఉన్న ఫొటోను ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది అలియా భట్.

తొలి సంతానం అమ్మాయే..

తొలి సంతానం అమ్మాయే..

రణ్ బీర్ కపూర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ సింగ్ దంపతులకు కూడా ముందుగా అమ్మాయే జన్మించింది. రణ్ బీర్ కంటే ముందు రిద్దిమాకు నీతూ సింగ్ జన్మనిచ్చారు. రిషి కపూర్ తొలి సంతానం అమ్మాయే. ఇప్పుడు అచ్చం తండ్రి రిషి కపూర్ లానే రణ్ బీర్ కపూర్ కు తొలి సంతానంగా అమ్మాయే పుట్టడం విశేషం. అంతేకాకుండా అలియా భట్ తండ్రి మహేశ్ భట్ కు కూడా తొలి సంతానం అమ్మాయే.

సో ఇదంతా చూస్తుంటే ఇటు కపూర్ ఫ్యామిలికీ, అటు భట్ కుటుంబానికి తొలి సంతానంగా ఆడపిల్లే పుట్టడం ఆనవాయితీగా వస్తోందని తెలుస్తోంది. అలియా భట్-రణ్ బీర్ సింగ్ దంపతులు అమ్మాయికి జన్మనిచ్చికి తల్లిదండ్రులు కావడంతో ఇరు కుటుంబాలు సంబరాలు చేసుకుంటున్నట్లు టాక్.

రెండు నెలలకే..

రెండు నెలలకే..

కాగా ఈ ఏడాది ఏప్రిల్ 14న రణ్ బీర్ కపూర్, అలియా భట్ వివాహబంధంతో ఒక్కటై కలిసి ఏడు అడుగులు వేశారు. ఆ తర్వాత పెళ్లయిన రెండు నెలలకే అలియా భట్ గర్భవతి అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానులను, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. దీంతో పలు మీమ్స్, ట్రోలింగ్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఆ వార్త కొంతమందికి సందేహాలు తీసుకొస్తే మరికొంతమందికి సర్ ప్రైజింగ్ గా అనిపించింది. పెళ్లికి ముందే అలియా భట్ ప్రెగ్నెంట్ అని, అందుకే హడావిడిగా వివాహం చేశారని రూమర్స్ సైతం వచ్చాయి. రణ్ బీర్, అలియా ప్రేమకథకు బ్రహ్మాస్త్ర సినిమా కారణమైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీళ్లిద్దరూ పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత బ్రహ్మాస్త్రం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X