భారీ బడ్జెట్ మూవీ ‘కళంక్’ ప్లాప్ రిపోర్ట్స్‌పై అలియా భట్ రియాక్షన్
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన ప్రతి సినిమాలోనూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో నటిగా తన స్థాయిని పెంచుకుంటూ దూసుకెళుతోంది. అయితే ఆమె నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ 'కళంక్' బాక్సాఫీసు వద్ద ఫెయిలైంది. గతవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు హాజరైన అలియా భట్ 'కళంక్' ఫలితంపై స్పందించారు. 'ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సార్లు వారి ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది. కొన్ని సార్లు అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు.' అన్నారు.

అన్నీ హిట్లే కాదు, కొన్ని ప్లాపులు తప్పవు
సినిమా ఇండస్ట్రీలో మనకు ఎదురయ్యే ప్రతి అనుభవం కొత్త విషయాలను నేర్పుతుంది. సక్సెస్ వచ్చినపుడు దాన్ని కంటిన్యూ చేయడం, ఫెయిల్యూర్స్ వచ్చినపుడు వాటిని సరిదిద్దుకోవడం నేర్చుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్రతి రోజు సన్ షైన్ ఉండదు, అప్పుడప్పుడూ వర్షం కూడా పడుతుంది అని అలియా భట్ చెప్పకొచ్చారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ఎప్పుడూ హిట్సే ఉండవు, అప్పుడప్పుడు ప్లాపులు కూడా ఉంటాయని చెప్పకనే చెప్పారు.

రూప్ పాత్రలో అలియా భట్
‘కళంక్' చిత్రంలో అలియా భట్ రూప్ అనే పాత్రలో నటించింది. భారీ మల్టీ స్టారర్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్, మాధురి దీక్షిత్, సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలు పోషించారు.

ఫస్ట్ వీకెండ్ ఎంత వసూలైంది?
మహావీర్ జయంతి హాలిడే సందర్భంగా ‘కళంక్' మూవీ ఫిబ్రవరి 10న విడుదలైంది. సినిమాపై ముందు నుంచీ భారీ హైప్ ఉండటంతో తొలి రోజు ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 21.60 కోట్లు వసూలు చేసింది. అయితే మిక్డ్స్ టాక్ రావడంతో వసూళ్లు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి.

ప్లాప్ అని తేలిపోయింది
‘కళంక్' చిత్రాన్ని రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. 5 రోజుల ఎక్స్‌టెండెడ్ వీకెండ్ వచ్చినప్పటికీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రం రూ. 66.03 కోట్ల రాబట్టింది. ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెల పోతున్నాయి. రూ. 100 కోట్ల అందుకోవడం కూడా కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











