Alia Bhatt: అలియా భట్ కూతురుకి అబ్బాయి పేరు?.. వీడియో వైరల్

బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ రణ్ బీర్ కపూర్ అండ్ అలియా భట్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. అలియా భట్ ఇవాళ అంటే నవంబర్ 6 ఆదివారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అలియా భట్ కు మరో క్యూటి అమ్మాయి పుట్టింది. సౌత్ ముంబైలో ఉన్న గిరిగావ్ లోని హెచ్ఎన్ రియలన్స్ ఆసుపత్రిలో అలియా భట్ ప్రసవం జరిగింది. దీంతో అటు కపూర్ ఫ్యామిలీ, ఇటు భట్ ఫ్యామిలీ సంతోషంలో మునిగితోలింది. తమకు అమ్మాయి పుట్టిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన అలియా భట కు సెలబ్రిటీల నుంచి నెటిజన్ల వరకు శుభాకాంక్షలు వెలువెత్తాయి. అయితే ప్రస్తుతం అలియా భట్ కుమార్తె పేరుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో హాట్ గా మారింది.

ఏప్రిల్ 14న వివాహబంధంతో..

ఏప్రిల్ 14న వివాహబంధంతో..

బాలీవుడ్ కపుల్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ గత కొంతకాలంగా లవ్ ఉన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకు చిగురు వేయడానికి కారణం బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్. చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన రెండు నెలలకే అలియా భట్ గర్భవతి అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానులను, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది.

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్..

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్..

అలియా భట్ ప్రెగ్నెన్సీ అని ప్రకటించడంతో సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోలింగ్స్ తెగ పుట్టుకొచ్చాయి. అయితే ఆ వార్త కొంతమందికి సందేహాలు తీసుకొస్తే మరికొంతమందికి సర్ ప్రైజింగ్ గా అనిపించింది. పెళ్లికి ముందే అలియా భట్ ప్రెగ్నెంట్ అని, అందుకే హడావిడిగా వివాహం చేశారని రూమర్స్ సైతం వచ్చాయి. రణ్ బీర్, అలియా ప్రేమకథకు బ్రహ్మాస్త్ర సినిమా కారణమని తెలిసిందే.

నవంబర్ 6న పాపకు జన్మనిచ్చినట్లు..

నవంబర్ 6న పాపకు జన్మనిచ్చినట్లు..

బ్రహ్మాస్త్ర షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీళ్లిద్దరూ పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత బ్రహ్మాస్త్రం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల ఓటీటీలోకి వచ్చి అలరిస్తోంది బ్రహ్మాస్త్ర. ఇదిలా ఉంటే నవంబర్ 6న తను పాపకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది అలియా భట్. "మా జీవితాల్లోకెల్లా గొప్ప వార్త. మా బేబీ వచ్చేసింది. తను చాలా అద్భుతమైన అమ్మాయి. మేము అధికారికంగా మా ప్రేమను ప్రకటిస్తున్నాం.

ఆనందంలో కపూర్ ఫ్యామిలీ..

ఆనందంలో కపూర్ ఫ్యామిలీ..

ప్రేమతో తల్లిదండ్రులు అయ్యాం. లవ్ లవ్ లవ్ అలియా అండ్ రణ్ బీర్" అంటూ ఉన్న మూడు సింహాలు ఉన్న ఫొటోను అలియా భట్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో కపూర్ ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా అలియా భట్ కుమార్తె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఓ రియాలిటీ షోలో..

ఓ రియాలిటీ షోలో..

అలియా భట్ పాపాయి పేరు ఇదేనంటూ ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఇంతకుముందు అలియా భట్ తన పెళ్లి, పిల్లల గురించి బాహటంగానే కామెంట్స్ చేసింది. ఓ రియాలిటీ షోలో పాల్గొన్న అలియా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ షోలో కంటెస్టెంట్ గా ఉన్న ఒక చిన్న అబ్బాయిని తన పేరు స్పెల్లింగ్ చెప్పమని కోరింది అలియా భట్. దానికి ఆ చిన్నారి ALMAA అని స్పెల్లింగ్ చెప్పాడు.

నా కూతురుకు ఇదే పేరు పెడతాను..

రియాలిటీ షోలోని ఆ బాబు అలా చెప్పడంతో అలియా భట్ గట్టిగా నవ్వుతూ 'అల్మా'.. పేరు చాలా బాగుంది. నా కూతురుకు ఇదే పేరు పెడతాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు అలియా భట్ కు కూతురు పుట్టడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పుడు అలియా భట్ తన కూతురికి అదే పేరు పెడుతుందా.. లేదా వేరే ఏమైనా పెడతారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X