అలియా భట్ దగ్గర పనిచేస్తూ 1 కోటీ రూపాయాల మోసం.. వేదికను అరెస్ట్ చేసిన పోలీసులు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పేరు తాజాగా వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ముంబై పోలీసులు వేదిక ప్రకాశ్ శెట్టిని అరెస్ట్ చేయడమే. అయితే ఆమె గతంలో నటి అలియా భట్ దగ్గర వ్యక్తిగత సహాయకురాలిగా పని చేసింది. ఈ క్రమంలో వేదిక కొంత డబ్బును తప్పదిసినట్టుగా ఆరోపణలు ఎదుర్కోంటోంది. ఈక్రమంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు అందండంతో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వేదిక ప్రకాశ్ శెట్టిని అరెస్ట్ చేసినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఇంతకీ వేదిక ప్రకాశ్ శెట్టి ఎవరు? ఎలాంటి ఆరోపణలను ఎదుర్కొంటోంది? ఎంత నగదు దారి మళ్లింది? పోలీసులు ఏమంటున్నారనే వివరాల్లోకి వెళితే..
వేదిక ప్రకాశ్ శెట్టి ఎవరు?
ముంబైకి చెందిన వేదిక ప్రకాశ్ శెట్టి బాలీవుడ్ నటి అలియా భట్ దగ్గర 2 సంవత్సరాల పాటు పర్సనల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించింది. 2024తో ఆమె జాబ్ నుంచి తప్పుకుంది. ఈ సమయంలో ఆమె అలియా భట్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలను చూస్తూ ఉంది. అలాగే అలియా భట్ కు సంబంధించిన ఎటెర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యకలాపాలను కూడా ఆమె చూస్తూ వచ్చింది. గత ఏడాదిగా ఆమె అలియా భట్ దగ్గర పనిచేయడం లేదు.

అలియా భట్ దగ్గర 76 లక్షల మోసం..
2025 జనవరిలో వేదిక ప్రకాశ్ శెట్టి అన్ని పేమెంట్స్ కు సంబంధించిన ఫైల్స్, బిల్స్ ను అలియా భట్ కు హ్యండోవర్ చేసింది. దాంతో జనవరి 23న అలియా అన్ని ఇన్ వాయిస్ లను అందుకుంది. ఇక సరి చూసే క్రమంలో 76 లక్షల డబ్బు తక్కువగా చూపించింది. దాంతో ఆమె అకౌంట్స్ ను సరిచూసింది. మొత్తం ఆడిట్ కూడా చేయించింది. దీంతో వేదిక ప్రకాశ్ శెట్టి నగదును మళ్లించినట్టు తెలుసుకుంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి చాలా మొత్తంలో డబ్బును తన అకౌంట్స్ లోకి మళ్లించిందని తెలుసుకుంది. మొత్తం 76,90,892 రూపాయాల నగదు అలియాభట్ కు సంబంధించిన ఎటెర్నల్ సన్ షైన్స్ సంస్థ నుంచి అక్రమంగా మళ్లించబడింది. ఇదంతా 2023 నుంచి 2025 వరకు జరిగిందని అలియా భట్ టీమ్ చెబుతోంది.
వేదికను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు..
దీంతో అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ ముంబై పోలీసులను ఆశ్రయించింది. ముంబైలోని జుహూ పోలీసులకు వేదికా ప్రకాశ్ శెట్టిపై నగదు దొంగలించిందని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇక TOIకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేదికను పట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాం. కేసు నమోదైనప్పటి నుంచి ఆమె ఒక నగరం నుంచి మరో నగరానికి తిరుగుతూనే ఉంది. మంగళూరు నుంచి రాజస్థాన్ కు, అక్కడి నుంచి పూణె, అక్కడి నుంచి బెంగళూరు కు వెళ్లింది. ఫైనల్ గా బెంగళూరులో ట్రాక్ చేశాం.' అని తెలిపారు. ఇక ప్రస్తుతం పోలీసులు వేదిక బ్యాంక్ అకౌంట్స్ ను పరిశీలిస్తున్నారు. ఆమె ఎలా నగదును అక్రమంగా తరలించిందనే వివరాలను సేకరిస్తున్నారు.
అలియా భట్ రాబోయే చిత్రాలు..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ టాలీవుడ్ లోకి 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో సౌత్ ఆడియెన్స్ లోనూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అల్ఫా అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలోని లవ్ అండ్ వార్ అనే చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











