Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఈ ఏడాది ఎక్కువ సమస్యల్లో ఇరుక్కున్న RRR బ్యూటీ.. ఏం చేసినా దరిద్రం వదల్లేదు
2020లో ఏ సెకనులో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నారో గాని కొంతమంది జీవితాల్లో మాత్రం ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అయితే తన కెరీర్ లో అయితే మునుపెన్నడూ లేనంతగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె హ్యాపీగా గడిపిన క్షణాల కంటే కూడా అనవసర వివాదాల్లో ఇరుక్కున్న సందర్భాలే ఎక్కువ. అసలు అలియా ఆ సమస్యల వల్ల ఎంత బాధపడిందో తెలియదు గాని ఈ ఏడాది కాంట్రవర్సీలలో ఎక్కువగా నిలిచిన స్టార్ హీరోయిన్ మాత్రం ఆమెనే అని చెప్పాలి.
యువ హీరోయిన్ ఆభా పాల్ ఫోటోషూట్ వైరల్... బికినీలో లేటెస్ట్ ఫోటోలు మీ కోసం..
కేవలం సినిమాలతోనే కాకుండా..
హీరోయిన్ గా తనకంటూ ఒక క్రేజ్ అందుకున్న అలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిమణుల్లో ఒకరు. సీనియర్ డైరెక్టర్ మహేష్ భట్ కుతురైన ఈ యువ నటి తన గ్లామర్ తోనే మంచి క్రేజ్ అందుకుంది. కేవలం సినిమాలతోనే కాకుండా వివిధ రకాల యాడ్స్ లలో నటిస్తూ భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకుంటోంది.
ఏం చేసినా కూడా దరిద్రం వెంటాడుతూనే ఉంది..
అసలు మ్యాటర్ లోకి వస్తే 2020 మొదలైనప్పుటి నుంచి కూడా ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొన్న వారిలో అలియా భట్ ఒకరు. సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి కూడా ఆమెపై వస్తున్న విమర్శలు అన్ని ఇన్ని కావు. ఏం చేసినా కూడా దరిద్రం ఒక రేంజ్ లో వెంటాడింది. గతంలో ఆమె సుశాంత్ పై చేసిన. కొన్ని ఇన్ డైరెక్ట్ నెగిటివ్ కామెంట్స్ ను కూడా గుర్తు చేసుకున్న నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు.
డిజాస్టర్ గా నిలిచిన సడక్ 2
ఇక ఆ ఎఫెక్ట్ నుంచి ఆమెకు నెపోటీజమ్ ఉచ్చు కూడా ఎంతగానో ఎఫెక్ట్ చూపించింది. సోషల్ మీడియాలో నెపోటీజమ్ కామెంట్స్ లలో అలియా భట్ పేరును కూడా మరో అర్థం వచ్చేలా ట్రెండ్ చేశారు. ఏ ఎఫెక్ట్ అప్పుడే సడక్ 2 సినిమాపై కూడా చూపించింది. ఆ సినిమా ట్రైలర్ కు అత్యదిక స్థాయిలో డిస్ లైక్స్ రావడం ఒక రికార్డ్ అనే చెప్పాలి. హాట్ స్టార్ లో విడుదలైనా కూడా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
RRR షూటింగ్.. అక్కడ కూడా..
ఇక మొన్న RRR సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది అనగానే మరొక రకంగా ట్రోలింగ్స్ కు గురైంది అలియా భట్. ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజుకు జోడిగా సీత అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అలియా భట్ లాంటి హీరోయిన్ సీత పాత్ర చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఏకంగా ఒక హ్యాష్ ట్యాగ్ ను కూడా క్రియేట్ చేసేశారు.
మాఫియా రారాణి బయోపిక్.. కేసు నమోదు
ఇక చాలా రోజుల తరువాత అలియా భట్ మొదలు పెట్టిన గంగూబాయ్ కతియావాడి సినిమా కూడా చిక్కుల్లో పడింది. ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేస్తున్నాడు. ముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్ టైటిల్ రోల్ లో కనిపించనుంది. అయితే గంగూబాయి పుత్రుడు ఈ సినిమాను నిలిపివేయాలని అలియాపై, డైరెక్టర్ పై కేసు నమోదు చేసి కోర్టుకెక్కడు. దీంతో మరోసారి అలియా భట్ సమస్యల్లో ఇరుక్కున్నట్లయ్యింది. ఇక జనవరి 7లోగా చిత్ర యూనిట్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని బాంబే సివిల్ కోర్టు తెలిపింది.