అలియా భట్ గంగుబాయి కతియావాడి న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్.. RRR కంటే ముందుగానే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న ఆలియాభట్ మరొకసారి డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ వేశ్య పాత్రలో ఆకట్టుకోబోతోంది. ముంబైలో కొన్నేళ్ల క్రితం కామటిపూరలో లేడి డాన్ గా గుర్తింపు అందుకొని ఎంతోమంది వేశ్యలకు ధైర్యం ఇచ్చిన గంగుబాయి కతియావాడి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో అలియా భట్ లీడ్ రోల్ లో కనిపించనుంది. గత ఏడాది నుంచి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ అనుకోని కారణాల వలన ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఇక ఈసారి ఎలాగైనా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఫిక్స్ అయ్యారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు అందుకున్నటువంటి సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కేవలం హిందీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె నుంచి రాబోయే సినిమాల్లో RRR సినిమా కూడా ఉంది. ఆ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో అలియా భట్ సీత పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా విడుదల కాకముందు తెలుగులో ఆమెకు మంచి క్రేజ్ అయితే ఏర్పడింది.

 Alia bhatt Gangubai Kathiawadi new release date fix

ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు గత ఏడాది నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అసలైతే సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ అప్పుడు మిగతా పెద్ద సినిమాల నుంచి పోటీ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కంటే ముందే సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫిబ్రవరి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ను విడుదల చేశారు. బయోగ్రాఫికల్ క్రైమ్ త్రిల్లర్ గా తెరపైకి రానున్న ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.

ముంబై నగరంలో ఒకప్పుడు ఎక్కువగా వినిపించిన పేర్లతో గంగుబాయి కూడా ఉన్నారు. మోసపూరితంగా అనుకోకుండా వేశ్యల ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆమె ఆ తరువాత ఒక లోకల్ డాన్ కు రాఖీ కట్టి కామటి పురానికి రాణి గా చక్రం తిప్పారు. బడా నేతలకు కూడా చెమటలు పట్టించి బలవంతపు వ్యభిచారానికి స్వస్తి పలికారు. కామాటి పూరలో ఇప్పటికి కూడా వేశ్యల గృహాల్లో గంగుభాయికి సంబంధించిన ఫొటోలు దర్శనమిస్తుంటాయి. అంతలా క్రేజ్ అందుకున్న ఆమె జీవితం గురించి తెలుసుకోవాలని చాలామందిలో కొంత ఆసక్తి నెలకొంది. ఇక సంజయ్ లీలా భన్సాలి ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నారు. మరి 2ఫిబ్రవరి 25న రాబోయే ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X