అక్టోబర్ నుంచి సెట్స్ పైకి అలియా సినిమా

సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియవాడి'.ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో బాలీవుడ్‌కి చెందిన ఇద్దరు కథానాయకులు ఇందులో నటించనున్నారు. కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం పరిమిత సంఖ్యలో షూటింగ్‌ చేసుకోవడానికి రాష్ట ప్రభుత్వాలకి అధికారం ఇచ్చింది.

అయితే ఈ సినిమా కోసం ఫిలిం నగర్ లో ఓ భారీ సెట్ వేశారు. ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేయాలని చూసారు కానీ కరోనా ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు వేసింది. అయితే ఫిలిం సిటీలో వేసిన సెట్ లాక్ డౌన్ కారణంగా నిరుపయోగంగా ఉండిపోయింది పైగా వర్షాలు కూడా పడటం తో సెట్ అంతా పాడైపోయింది.

దాంతో ఆ సెట్ ను పడగొట్టి ..మరో చిన్న సెట్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన సన్నివేశాలను వీలైనంత తక్కువ మందితో షూట్ చేయాలనీ భన్సాలీప్లాన్ చేస్తున్నారట మిగిలిన భాగాన్ని వీఎఫ్ఎక్స్ సహాయం తో సర్దుబాటు చేయాలనీ చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఎక్కడ తగ్గకుండా అనుకున్న స్థాయిలో నిర్మిస్తున్నాడు భన్సాలీ. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సెట్ లో అక్టోబర్ నుంచి షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు.

alia bhatt-gangubai kathiawadi starts from october

ముందుగా ఈ సినిమాను ప్రియాంక చోప్రా తో తెరకెక్కించాలనుకున్నారు కానీ అనుకోని కారణాల వల్ల ప్రియాంక ప్లేస్ లోకి అలియా భట్ వచ్చింది. ఇందులో గ్యాంగ్‌స్టర్‌ కరీం లాలా పాత్రలో అజయ్‌ దేవగణ్‌ నటించనున్నాడు. ఇక మరో పాత్రలో ఎమ్రాన్‌ హస్మీ నటించనున్నాడని సమాచారం. చిత్రానికి ఈ రెండు పాత్రలు చాలా ముఖ్యమైనవి.

గంగూబాయిగా అలియా భట్‌ వేశ్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది. ఇప్పటికే పాత్రకు సంబంధిచిన పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. అన్నట్టు అజయ్‌ దేవగణ్‌ - ఎమ్రాన్‌ హస్మీలు కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో వీరిద్దరు 'వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబై' చిత్రంలో నటించారు. గుంగూబాయి చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీ ద్వారా కాకుండా సాధ్యమైనంత వరకు థియేటర్లోలోనే విడుదల చేయాలని చూస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X