రణ్‌బీర్‌కు అలియా లవ్లీ గిఫ్ట్.. బర్త్ డే బహుమతి ఖరీదు ఎంతంటే!
బాలీవుడ్‌లో రణబీర్ కపూర్, అలియా భట్ మధ్య ప్రేమాయణం కొద్దికాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో వారిద్దరి మధ్య చనువు మరింత పెరిగింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త అప్పట్లో వైరల్ అయింది. అయితే రణ్‌బీర్ తండ్రి రిషికపూర్ మరణంతో పెళ్లి వాయిదా పడినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా తన ప్రియుడు రణ్‌బీర్‌కు అలియా భట్ ఇచ్చిన గిఫ్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు గిఫ్ట్ వాల్యూ ఎంతంటే..

రణబీర్ కపూర్ బర్త్ డే రోజున
ఇటీవల తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌కు ఈ-బైక్ ఇచ్చినట్టు అలియాభట్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ ఫొటో పెట్టి షేర్ చేశారు. బైక్‌తోపాటు పార్టీ జరుపుకొన్నట్టు ఇమేజ్‌ను కూడా షేర్ చేశారు. సెప్టెంబర్ 28న రణ్‌బీర్ బర్త్ డే సందర్భంగా బైక్‌ను గిఫ్టుగా ఇచ్చినట్టు తెలుస్తున్నది.

రణబీర్ కోసం అలియా డిజైన్డ్ బైక్
ఇక రణ్‌బీర్ కోసం అలియా భట్ బైక్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్టు సమాచారం. తమ మధ్య రిలేషన్ మొదలైన తర్వాత ఎనిమిదో బర్త్ డే జరుపుకొంటున్నందున ఆ బైక్‌పై 8వ నెంబర్‌ను ప్రింట్ చేయించినట్టు సమాచారం. అంతేకాకుండా మేట్ (సహచరుడు) అంటూ లోగోను కూడా ప్రింట్ చేయించడం కనిపించింది.

అలియా భట్ ఇచ్చిన గిఫ్ట్ ఖరీదు
రణ్‌బీర్‌కు గిఫ్టుగా ఇచ్చిన బైక్ ఫోల్డ్ చేసుకొని సులభంగా ఎక్కడికైనా తీసుకు వెళ్లే విధంగా అలియా భట్ డిజైన్ చేయించింది. సాధారణంగా ఈ బైక్ ఖరీదు లక్ష రూపాయల లోపే ఉన్నప్పటికీ.. స్పెషల్‌గా డిజైన్ చేసి కొన్ని ఫీచర్లు అదనంగా చేర్చడంతో కాస్త కాస్ట్లీగా అయిందనేది సమాచారం. మొత్తంగా ఈ బైక్ విలువ రూ.2 లక్షల వరకు ఉండవచ్చనేది అంచనా.

అలియా గిఫ్టును రణ్‌బీర్ ఇష్టంగా
ముంబైలో కొత్తగా నిర్మిస్తున్న భవనం వద్దకు తల్లితో కలిసి రణ్‌బీర్ వెళ్లారు. అయితే తల్లి కారులో వెళితే... రణ్‌బీర్ మాత్రం ఎలాక్ట్రానిక్ బైక్‌పై వెళ్లారు. అలా సైకిల్‌పై రణ్‌బీర్ వెళ్లడం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తన ప్రియురాలు అలియాభట్ గిఫ్టుగా ఇచ్చిన బైక్‌ను ఇష్టంగా చూసుకొంటున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











