షాకింగ్: తనకు పుట్టబోయే బిడ్డ పేరు వెల్లడించిన అలియా భట్!
Recommended Video

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. యంగ్ హీరో రణబీర్ కపూర్‌తో ప్రమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల అంగీకారం కూడా ఉండటంతో త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. 2012లో అలియా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ద్వారా నటిగా ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే రణబీర్ కపూర్ మీద ఇష్టం పెంచుకుంది. సినిమాల్లోకి వచ్చాక అతడినే తన ప్రియుడిగా పొందడంలో సక్సెస్ అయింది.

పెళ్లి విషయంలో ఇంకా సస్పెన్స్
అలియా భట్, రణబీర్ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతుండటంపై వారి అభిమానులు సైతం ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. మరి పెళ్లి ఎప్పుడూ అని అడిగితే మాత్రం అలియా తెలివిగా సమాధానం ఇస్తోంది. సరైన సమయం వచ్చినపుడు చేసుకుంటానని చెబుతూ సస్పెన్స్ మెయింటేన్ చేస్తోంది.

పుట్టోయే కూతురు గురించి అలియా..
అయితే ఇంకా పెళ్లి గడియలు రాకముందే అలియా భట్ తనకు పుట్టబోయే పిల్లల గురించి, వారికి ఎలాంటి పేర్లు పెట్టాలనే విషయం ఆలోచిస్తుండటం చర్చనీయాంశం అయింది. ఇటీవల ఓ డాన్స్ షోలో అలియా నోటి నుంచి ఈ ప్రస్తావన రావడంతో అంతా షాకయ్యారు.

ఆ పేరే పెడతానంటున్న అలియా
అలియా భట్ నటించిన తాజా చిత్రం ‘గల్లీ బాయ్' ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ డాన్స్ రియాల్టీ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ పార్టిసిపెంట్ అలియా పేరును పొరపాటున ‘ఆల్మా' అని పలికింది. దీనికి అలియా రియాక్ట్ అవుతూ ఆ పేరు చాలా అందంగా ఉందని, తనకు పుట్టబోయే బిడ్డకు అదే పేరు పెడతానంటూ వ్యాఖ్యానించారు.

అలియా భట్
అలియా భట్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రణవీర్ సింగ్‌తో కలిసి ఆమె నటించిన ‘గల్లీబాయ్' వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. దీంతో పాటు తన ప్రియుడు రణబీర్ కపూర్‌తో కలిసి బ్రహ్మాస్త్ర చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











