twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ల మధ్య చిచ్చు.. దుమ్మెత్తిపోస్తున్నా సైలెంట్‌గానే!

    |

    కంగనా తరచుగా వివాదాల్లో నిలుస్తుండడం చూస్తూనే ఉన్నాము. మొన్న విడుదలైన మణికర్ణిక చిత్రం వరకు కంగనా రనౌత్ చుట్టూ అన్నీ వివాదాలే. ఎలాంటి విషయం గురించి అయినా కంగనా మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంది. వివాదాలు వెంటాడుతున్నా నటిగా కంగనా దూసుకుపోతోంది. ఇటీవల కంగనా రనౌత్ అలియా భట్ కుటుంబంపై తీవ్ర విమర్శలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కంగనా సోదరి రంగోలి అలియా భట్ తండ్రి మహేష్ భట్ పై కూడా విమర్శలు చేసింది. ఈ వివాదంపై అలియా భట్ ఎట్టకేలకు స్పందించింది.

    అలియా భట్‌పై విమర్శలు

    అలియా భట్‌పై విమర్శలు

    గత కొన్ని రోజులుగా అలియా భట్‌పై కంగనా రనౌత్ అన్ని కోణాల్లో విమర్శలు చేస్తోంది. అలియా భట్ నటనని కంగనా వెక్కిరించింది. నటనలో తనతో పోటీ పడగల సత్తా అలియా భట్ కు లేదని.. తయచేసి తనతో ఆమెని పోల్చవద్దు అంటూ కంగనా బహింరంగంగా విమర్శించింది. ఇక వారసత్వం విషయంలో కూడా అలియా భట్ పై కంగనా వ్యాఖ్యలు చేసింది. తన పిల్లలు వారసత్వంగా తన మద్దతు కోరుకుంటే వారిని సముద్రంలో పడేస్తానంటూ కంగనా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

    చెప్పు విసిరారు

    చెప్పు విసిరారు

    ఇదిలా ఉండగా కంగనా రనౌత్ సోదరి రంగోలి అలియా భట్ కుటుంబంపై ఇంకాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. కంగనా రనౌత్ ని అలియాభట్ కుటుంబం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిందని, చివరకు కంగనాపై అలియా తండ్రి మహేష్ భట్ చెప్పు కూడా విసిరారని రంగోలి వ్యాఖ్యానించింది. ఈ విమర్శలపై అలియా భట్ కుటుంబం ఇంత వరకు స్పందించలేదు.

    ప్లాప్ దిశగా భారీ బడ్జెట్ మూవీ! తొలి రోజు కలెక్షన్లు ఫుల్... తర్వాత డల్!ప్లాప్ దిశగా భారీ బడ్జెట్ మూవీ! తొలి రోజు కలెక్షన్లు ఫుల్... తర్వాత డల్!

    ఎవరేమనుకున్నా సరే

    ఎవరేమనుకున్నా సరే

    కంగనా రనౌత్ విమర్శలపై అలియా భట్ తాజాగా స్పందించింది. నా కుటుంబం నా కన్నా పది రెట్లు ధృడంగా ఉంటుంది. తాను ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్ గా ఉండాలనుకునే వ్యక్తిని. ఇలాంటి నెగిటివ్ విషయాలని పట్టించుకోను, తలదూర్చను అని అలియా భట్ తెలిపింది. ఎలాంటి విమర్శలు ఎదురైనా నా పని చేను చేసుకుపోవాలని అనుకుంటున్నట్లు అలియా భట్ తెలిపింది.

    మాట్లాడే హక్కు ఉంది

    మాట్లాడే హక్కు ఉంది

    అందరికి భావస్వేచ్ఛ ప్రకటన హక్కు ఉంది. కానీ నేను మాత్రం సైలెంట్ గానే ఉంటా. అలాంటి కామెంట్స్ పట్టించుకోను అని అలియా తెలిపింది. సినిమాల విషయానికి వస్తే అలియా భట్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు రణబీర్ కపూర్ తో బ్రహ్మాస్త్ర చిత్రంలో కూడా నటిస్తోంది.

    English summary
    Alia Bhatt hits back at Kangana Ranaut for attacking her family. After Kangana Ranaut and her sister Rangoli Chandel's constant nagging, Alia Bhatt has broken her silence on Ranaut's sisters for attacking her family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X