పెళ్లి అయిపోయింది.. అతడితో చాలా హ్యాపీగా ఉన్నా.. ఆలియాభట్
బాలీవుడ్ హీరో, హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ మధ్య ప్రేమ వ్యవహారంపై పెదవి విప్పడానికి ఆసక్తి చూపలేదు. కానీ తాజా ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌తో అఫైర్ గురించి ఆలియా ముసిముసి నవ్వులతో స్పందించారు. ప్రస్తుతం గల్లీబాయ్ చిత్రంతో భారీ సక్సెస్‌ను అందుకొన్న ఆలియాభట్ చెప్పినదేమిటంటే..

మానసిక పరిపక్వతతో ఉన్నాను
రణ్‌బీర్‌తో రిలేషన్‌షిప్‌పై ఆలియా స్పందిస్తూ.. కాలం మారుతున్నది. వ్యక్తిగతంగా నేను పెద్దదానిని అవుతున్నాను. మానసికంగా మంచి పరిపక్వత కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నా రిలేషన్‌ఫిప్‌ను దాచిపెట్టడం ఇష్టం లేదు. అలా అని బహిరంగ పరిచే ఉద్దేశం కూడా లేదు. నాపై వస్తున్న రూమర్లకు సమాధానం ఇవ్వనవసరం కూడా లేదు అని అలియా చెప్పింది.

నాపై ఏదేదో రాస్తుంటారని
నేను సెట్లో విషాదంగా ఉంటానని, లేదా ఏడుస్తూ ఉంటానని ఏదోదే మీడియాలో రాసేస్తుంటారు. నాకు అలాంటి పరిస్థితులు ఇంకా రాలేదు. వచ్చే పరిస్థితులు కూడా లేవు. సెన్సేషన్ కోసం నాపై ఏదో కథనాన్ని మీడియా వండటం భావ్యం కాదు. వార్తల్లో వాస్తవాలు లేనప్పుడు వాటిని నేను ఎందుకు సీరియస్‌గా తీసుకోవాలి అని ఆలియా భట్ పేర్కొన్నారు.

రూమర్లు, గాసిప్స్ ఇరిటేట్ చేసేవి
నాపై వచ్చే వార్తలు, రూమర్ల గురించి ఆరంభంలో పట్టించుకొనే దానిని. ప్రేమ, ఆఫైర్, డేటింగ్, పెళ్లి లాంటి వార్తలు చాలా ఇరిటేట్ చేసేవి. ఇలాంటి విషయాలకు ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తుంటారో అనే విషయాన్ని బాగా ఆలోచించేదానిని. ఏ ఒక్కదాని కూడా సమాధానం దొరికేవి కావు అని ఆలియా అన్నారు.

నాకు పెళ్లి అయిపోయిందని
రణ్‌బీర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ప్రస్తుతం ఉన్న బంధంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడే పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదు. రణ్‌బీర్‌తో బలమైన రిలేషన్ ఏర్పడింది. పెళ్లి గురించి అడిగితే నాకు పనితో పెళ్లి అయిపోయిందని సమాధానం ఇస్తాను. అంతకంటే పెళ్లి గురించి నా వద్ద సమాచారం లేదు అని అలియాభట్ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications