For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    అలియాభట్‌కు బుర్ర లేదంటారేంటి? కంగన నోటి దురుసుకు దిమ్మతిరిగే జవాబు

    |

    వెండితెరపైన అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను, సినీ విమర్శకులను అద్భుతంగా ఆకట్టుకొంటున్న అందాల తార అలియాభట్‌ను బుర్ర లేదని, జనరల్ నాలెడ్జి లేదని ఎగతాలి చేస్తారు. కానీ తాజాగా కంగన కామెంట్లకు అలియా దిమ్మ తిరిగే సమాధానం చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకోవడం గ్యారెంటీ అంటున్నారు సినీ వర్గాలు. ఇటీవల ఓ అవార్డుల వేడుక కోసం ఉత్తమ నటి ఎవరనే ప్రశ్నపై అలియాభట్‌పై కంగన రనౌత్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ఆ వివాదంపై అలియాభట్ ఏమని స్పందించారంటే...

    గల్లీబాయ్‌కి మణికర్ణికకు పోలికనా?

    గల్లీబాయ్‌కి మణికర్ణికకు పోలికనా?

    తాజాగా ఉత్తమ నటి అవార్డు కోసం కంగన నటించిన మణికర్ణిక, అలియా భట్ నటించిన గల్లీబాయ్ సినిమాలు నామినేట్ అయ్యాయి. అలియాభట్‌తో పోటీ పడటంపై కంగన వ్యాఖ్యానిస్తూ.. గల్లీబాయ్ చిత్రం ఓ చెత్త చిత్రం. అలాంటి సినిమాలోని అలియా పాత్రతో నేను పోటీ పడటమా? గల్లీబాయ్‌కి మణికర్ణికకు పోలికనా అని కంగన ఘాటుగా స్పందించింది.

    కంగన రనౌత్ అంటే నాకు గౌరవం

    కంగన రనౌత్ అంటే నాకు గౌరవం

    కంగన రనౌత్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా.. అలియాభట్ స్పందిస్తూ.. కంగన రనౌత్ చేసే సినిమాలంటే నాకు గౌరవం. ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఆమె అలా మాట్లాడటం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉండాలి. బహుశా ఆమె మాట్లాడిన దాంట్లో నేను తప్పు పట్టడానికి ప్రయత్నించను అని అన్నారు.

     నా నటన గురించి మరోసారి

    నా నటన గురించి మరోసారి

    కంగన రనౌత్ నా గురించి ప్రశంసించిన సందర్భాలు నాకు బాగా గుర్తున్నాయి. రాజీ సినిమా చూసిన తర్వాత నా నటన గురించి చెప్పి నన్ను ప్రశంసించింది. మళ్లీ ఏదో సందర్భంలో నా నటన గురించి తప్పకుండా ప్రశంసిస్తుందని భావిస్తున్నాను. ఇప్పుడు అలాంటి వాటిని ఆలోచించడం మానేసి కేవలం వర్క్‌పై మాత్రమే దృష్టిపెట్టాలనుకొంటున్నాను అని అలియాభట్ తనదైన శైలిలో స్పందించింది.

     అలియాను టార్గెట్ చేసిన కంగన రనౌత్

    అలియాను టార్గెట్ చేసిన కంగన రనౌత్

    గత కొద్దిరోజులుగా అలియా, రణ్‌బీర్ కపూర్, ఇతర నటీనటులను టార్గెట్ చేసుకొని కంగన రనౌత్ కామెంట్లు చేస్తున్నది. తమ సినిమా ప్రీమియర్లకు హాజరుకావాలని పిలుస్తున్నారు. కానీ నా సినిమా ప్రీమియర్లకు కొందరు ముఖం చాటేస్తున్నారు అని ఇటీవల కంగన ఘాటుగా స్పందించింది. అలాగే దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై, పాలిటిక్స్‌పై రణ్‌బీర్, అలియా ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించింది.

    English summary
    In Kalank, media asked Alia about Kangana's statement about mance in Gully Boy as 'mediocre. Alia said "I respect Kangana’s work a lot and I respect her opinion. If she feels a particular way she must have reason to feel that way. I would rather remember how much she had praised me after watching Raazi.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more