Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అలియాభట్‌కు బుర్ర లేదంటారేంటి? కంగన నోటి దురుసుకు దిమ్మతిరిగే జవాబు
వెండితెరపైన అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను, సినీ విమర్శకులను అద్భుతంగా ఆకట్టుకొంటున్న అందాల తార అలియాభట్‌ను బుర్ర లేదని, జనరల్ నాలెడ్జి లేదని ఎగతాలి చేస్తారు. కానీ తాజాగా కంగన కామెంట్లకు అలియా దిమ్మ తిరిగే సమాధానం చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకోవడం గ్యారెంటీ అంటున్నారు సినీ వర్గాలు. ఇటీవల ఓ అవార్డుల వేడుక కోసం ఉత్తమ నటి ఎవరనే ప్రశ్నపై అలియాభట్‌పై కంగన రనౌత్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ఆ వివాదంపై అలియాభట్ ఏమని స్పందించారంటే...
గల్లీబాయ్‌కి మణికర్ణికకు పోలికనా?
తాజాగా ఉత్తమ నటి అవార్డు కోసం కంగన నటించిన మణికర్ణిక, అలియా భట్ నటించిన గల్లీబాయ్ సినిమాలు నామినేట్ అయ్యాయి. అలియాభట్‌తో పోటీ పడటంపై కంగన వ్యాఖ్యానిస్తూ.. గల్లీబాయ్ చిత్రం ఓ చెత్త చిత్రం. అలాంటి సినిమాలోని అలియా పాత్రతో నేను పోటీ పడటమా? గల్లీబాయ్‌కి మణికర్ణికకు పోలికనా అని కంగన ఘాటుగా స్పందించింది.
కంగన రనౌత్ అంటే నాకు గౌరవం
కంగన రనౌత్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా.. అలియాభట్ స్పందిస్తూ.. కంగన రనౌత్ చేసే సినిమాలంటే నాకు గౌరవం. ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఆమె అలా మాట్లాడటం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉండాలి. బహుశా ఆమె మాట్లాడిన దాంట్లో నేను తప్పు పట్టడానికి ప్రయత్నించను అని అన్నారు.
నా నటన గురించి మరోసారి
కంగన రనౌత్ నా గురించి ప్రశంసించిన సందర్భాలు నాకు బాగా గుర్తున్నాయి. రాజీ సినిమా చూసిన తర్వాత నా నటన గురించి చెప్పి నన్ను ప్రశంసించింది. మళ్లీ ఏదో సందర్భంలో నా నటన గురించి తప్పకుండా ప్రశంసిస్తుందని భావిస్తున్నాను. ఇప్పుడు అలాంటి వాటిని ఆలోచించడం మానేసి కేవలం వర్క్‌పై మాత్రమే దృష్టిపెట్టాలనుకొంటున్నాను అని అలియాభట్ తనదైన శైలిలో స్పందించింది.
అలియాను టార్గెట్ చేసిన కంగన రనౌత్
గత కొద్దిరోజులుగా అలియా, రణ్‌బీర్ కపూర్, ఇతర నటీనటులను టార్గెట్ చేసుకొని కంగన రనౌత్ కామెంట్లు చేస్తున్నది. తమ సినిమా ప్రీమియర్లకు హాజరుకావాలని పిలుస్తున్నారు. కానీ నా సినిమా ప్రీమియర్లకు కొందరు ముఖం చాటేస్తున్నారు అని ఇటీవల కంగన ఘాటుగా స్పందించింది. అలాగే దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై, పాలిటిక్స్‌పై రణ్‌బీర్, అలియా ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించింది.