RRR బ్యూటీకి మరో దెబ్బ.. చెత్తలోనే అతి చెత్త సినిమా.. మరీ ఇంత దారుణమా..?
బాలీవుడ్ లో గతంలో ఎప్పుడు లేని విధంగా నెపోటిజమ్ విమర్శలు ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రాణాలు విడిచినప్పటి నుంచి కూడా బాలీవుడ్ లో ఊహించని వాతావరణం కనిపిస్తోంది. ఇక అలియా భట్ నెపోటిజమ్ మహారాణి అంటూ నెటిజన్స్ ఒక రేంజ్ లో చుక్కలు చూపిస్తున్నారు.

భయటకు రాకపోతేనే బెటర్
నెపోటిజమ్ విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్స్ ప్రస్తుతం ఇళ్ల నుంచి భయటకు రాకపోతేనే బెటర్ అనేలా అలియా పరిస్థితి ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె నటించిన సడక్ 2 ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. అంతకుముందే సినిమా ట్రైలర్ పై ఏ స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

జనాలు పగబడితే..
జనాలు పగబడితే ఎలా ఉంటుందో సడక్ 2 రిలీజ్ వల్ల అర్ధమవుతోంది. నెంబర్ వన్ వరస్ట్ ట్రైలర్ గా ఆ సినిమాను నిలబెట్టిన ఓ వర్గం జనాలు ఇప్పుడు అదే సినిమా హాట్ స్టార్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవ్వగా రేటింగ్స్ తో షాక్ ఇచ్చారు. చెత్తలో చెత్త సినిమా అనే విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

జనాలు ఇచ్చిన రేటింగ్..
ఇక ప్రముఖ IMBD వెబ్ సైట్ లో సినిమాకు యూజర్లు కేవలం 1 రేటింగ్స్ ఇవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది. 35వేలకు పైగా ఓట్లతో ప్రస్తుతం 1 రేటింగ్ మాత్రమే ఉంది. నిన్నటివరకు 1.1 ఉండగా ఓ వర్గం ఆడియెన్స్ సినిమాను మరింత దెబ్బకొడుతున్నారు. సడక్ 2ని అసలు ఏం ఆశించి తీసారో తెలియదు కాని మెయిన్ పాత్రలో నటించిన అలియా భట్ ఇమేజ్ భారీ స్థాయిలో డ్యామేజ్ అయినట్లు కథనాలు వేలువడుతున్నాయి.
Recommended Video

భవిష్యత్తు ప్రాజెక్టులపై ఎఫెక్ట్..?
ప్రస్తుతం RRR వంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న అలియా భట్ ఈ విధంగా దారుణమైన నెగిటివ్ రిజల్ట్ అందుకోవడం చూస్తుంటే ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా ఎఫెక్ట్ పడుతుందా అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక RRR సినిమా నుంచి ఆమెను తప్పిస్తున్నారు అనే రూమర్స్ లో ఎలాంటి నిజ లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











