twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రణ్‌బీర్ జ్ఞాపకాల్లో అలియా.. మిస్ అవుతున్నానంటూ పోస్ట్.. అంతులేని ప్రేమ!

    |

    బాలీవుడ్ ప్రేమ పక్షుల్లో ఇప్పుడ అలియా భట్ రణ్ బీర్ కపూర్ ట్రెండింగ్‌లో ఉన్నారు. బాలీవుడ్‌లో హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమాయణాలు, బ్రేకప్‌లు అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్‌లో శ్రద్దా కపూర్, అలియా భట్, కత్రినా కైఫ్, దిషా పటానీ ప్రేమ వ్యవహారాలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఇందులో అలియా భట్ రణ్ బీర్ కపూర్‌ల ప్రేమ ముదిరి వివాహాం వరకు వెళ్లేలా కనిపిస్తోంది.

    అలా టాక్..

    అలా టాక్..

    రణ్ బీర్ కపూర్ అలియా భట్ వివాహాం గురించి నిత్యం ఏదో రకమైన వార్తలు వస్తూనే ఉంటాయి. అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అంటూ వార్తలు రాస్తూనే ఉంటారు. ఇప్పటికే ఎన్నో సార్లు ప్రేమ, బ్రేకప్ వంటి వ్యవహారాలతో రణ్ బీర్ కపూర్ తెగ ట్రోల్ అయ్యాడు. అలియా విషయంలో రణ్ బీర్ కపూర్ కాస్త ముందడుగు వేసేలా ఉన్నాడు.

    పెళ్లి అంటూ..

    పెళ్లి అంటూ..

    కరోనా వల్ల తన పెళ్లి వాయిదా పడిందంటూ ఆ మధ్య రణ్ బీర్ కపూర్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. ఆ మధ్య రణ్ బీర్ మీడియాతో మాట్లాడుతూ.. నా గర్ల్ ఫ్రెండ్ అలియా నాకంటే ఎంతో సాధించింది. ఈ లాక్డౌన్ సమయంలో గిటార్ నేర్చుకుంది.. స్క్రీన్ ప్లే రైటింగ్ నేర్చుకుందంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ 2020లో ఈ కరోనా రాకపోయి ఉంటే తామిద్దరం పెళ్లి చేసుకునే వాళ్లమని రణ్ బీర్ కపూర్ తెలిపాడు.

     కరోనా పాజిటివ్,..

    కరోనా పాజిటివ్,..

    అయితే తాజాగా రణ్ బీర్ కపూర్ కరోనా బారిన పడ్డాడు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ రణ్ బీర్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడంటూ రణ్ బీర్ తల్లి సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. ప్రస్తుతం క్వారంటైన్‌కే పరిమితమయ్యాడని తెలిపింది.

    మిస్ అవుతున్న అలియా..

    మిస్ అవుతున్న అలియా..

    అయితే తాజాగా అలియా తన ప్రియుడిని మిస్ అవుతోందంట. ఈ మేరకు రణ్ బీర్ కపూర్‌తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎంతో మిస్ అవుతున్నా.. అనంతమైన ప్రేమ అంటూ కొన్ని లవ్ సింబల్స్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Alia bhatt missing Ranbir kapoor Due to corona, Ranbir kapoor about marriage with alia bhatt,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X