ఆలియాభట్ తల్లిని ఆటాడుకొన్న నెటిజన్లు.. సోషల్ మీడియాలో ట్వీట్‌ దుమారం

కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ట్వీట్ చేసిన ఆలియాభట్ తల్లి, నటి సోని రజ్దాన్‌కు నెటిజన్లు చుక్కలు చూపించారు. కరోనావైరస్ సమయంలో అత్యంత విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న సినీ తారలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలంటూ, వారిని లబ్దిదారులుగా పరిగణించాలంటూ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.

నటి సోని రజ్దాన్ ట్వీట్ చేస్తూ... చాలా మంది సినీ తారలు కోవిడ్ బారిన పడ్డారు. వర్క్ ప్లేస్‌లో వాళ్లు అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. షూటింగు సమయాల్లో మాస్క్ ధరించకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సినీ వర్గాలు ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం దక్కలేదు అని పేర్కొన్నారు.

Alia Bhatt mother Soni Razdan gets trolled over Covid19 vaccination

దేశంలో ఎంతో మంది వృద్ధులకు కోవిడ్ వ్యాక్సిన్ అవసరం. సినీ తారలకంటే వారికే ఎక్కువ ముప్పు ఉంది. ఇంకా హెల్త్ వర్కర్స్‌కు వాక్సిన్ లభించలేదు. సెలబ్రిటీలు ఇంటి పట్టునే ఉంటున్నారు కాబట్టి వారికి అంతగా అవసరం లేదు అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందించారు .

అంతేకాకుండా మీలాంటి సంపన్న వర్గాలకు రకరకాల సౌలభ్యాలు ఉన్నాయి. ఇతరుల మాదిరిగా మీరు కష్టాల్లో లేరు. డబ్బు ఉంది కాబట్టి వాటిని అనుభవిస్తూ ఇంటి పట్టునే ఉండండి అంటూ నెటిజన్లు ధీటుగా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X