హీరోతో నా ఎఫైర్ చాలా సీక్రెట్.. పిల్లి లాగే ఈ ప్రేమ కూడా.. మీడియాపై కట్టలు తెంచుకున్న కోపం!

దీప్ వీర్, నిక్ యాంక, విరుష్క తరహాలో 'రాలియా' అనే హ్యాష్ టాగ్ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. రాలియా అంటే రణబీర్ కపూర్, అలియా భట్. త్వరలో ఈ జంట వివాహంతో ఒక్కటి కాబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మీడియా మొత్తం లవర్ బాయ్ రణబీర్ కపూర్ గురించి ఎప్పుడూ ఆరా తీస్తూనే ఉంటుంది. ఎందుకంటే అతడు సాగించే ప్రేమ వ్యవహారాలు అలాంటివి మరి. బాలీవుడ్ బడా హీరోయిన్లందరితో ఈ రొమాంటిక్ హీరో ప్రేమాయణాలు సాగించాడు. ప్రస్తుతం అలియా భట్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. తన ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తావించగానే అలియా భట్ కోపం కట్టలు తెంచుకుంది.

 ఏదో సాధించినట్టు కాదు

ఏదో సాధించినట్టు కాదు

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అలియా భట్ కు రణబీర్ కపూర్ తో ప్రేక గురించి ప్రశ్న ఎదురైంది. దీనితో అలియా భట్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను ఒకరితో రిలేషన్ షిప్ లో ఉన్నానంటే ఏదో సాధించినట్లు కాదు. అది వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఎవరైనా ఏదైనా గొప్పగా సాధిస్తే దాని గురించి అంతా మాట్లాడుకుంటారు. అందులో అర్థం ఉంది. కానీ నా ప్రేమ గురించి చర్చించుకోవడం ఏమిటి అని అలియా భట్ మండిపడింది.

ముఖ్యమైన అంశం

ముఖ్యమైన అంశం

ఒకరితో నేను రిలేషన్ షిప్ లో ఉన్నానంటే అది నా జీవితంలో ముఖ్యమైన అంశం. కానీ అది నా జీవితానికి సంబందించినది మాత్రమే. రిలేషన్ షిప్ ని సెలెబ్రేట్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. కానీ వాటన్నింటిని నేను బయట పెట్టాలని అనుకోను. మనం పెంచుకునే పిల్లితో కూడా ప్రేమగా ఉంటాం. దానిని రక్షించుకుంటాం. అంత మాత్రాన దానిగురించి సోషల్ మీడియాలో చర్చిస్తామా అంటూ ప్రేమకు, పిల్లికి లింకు పెట్టింది.

న్యూఇయర్ సెలెబ్రేషన్స్

న్యూఇయర్ సెలెబ్రేషన్స్

రణబీర్, అలియా కలసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం న్యూ యార్క్ వెళ్లారు. రణబీర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్ ప్రస్తుతం న్యూయార్క్ లోనే ఉన్నారు. రణబీర్ ఫ్యామిలీతో కలసి అలియా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ఫోటోని నీతూ కపూర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు లక్షల్లో లైకులు వస్తున్నాయి.

బ్రహ్మాస్త్రలో జంటగా

బ్రహ్మాస్త్రలో జంటగా

ప్రస్తుతం అలియా భట్, రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర చిత్రంలో జంటగా నాటిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో కంగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రియల్ లైఫ్ ప్రేమికులైన అలియా, రణబీర్.. ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ ఎలా పండించారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X