Just In
Don't Miss!
- Sports
గబ్బా హీరో రిషభ్ పంత్.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.!
- Finance
కంపెనీలు ఆ నిర్ణయం తీసుకుంటే.. వచ్చే అయిదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15%
- News
Inside info:జగన్ -షా మీటింగ్‌లో ఏం జరిగింది.. మళ్లీ ఢిల్లీకి సీఎం: ఏపీలో కీలక పరిణామాలు
- Lifestyle
బాదం చట్నీతో బోలెడన్నీ లాభాలు... దీన్ని ఈ సమయంలోనే ఎక్కువగా తినాలట...!
- Automobiles
2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా కలను నెరవేర్చుకున్నా.. లండన్‌లో అలా: ఆలియా భట్
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పింది. తను ఎంత సింపుల్‌గా ఉంటాననేది తెలుపుతూ తన ఇష్టాయిష్టాల గురించి కూడా వివరించింది. హంగు ఆర్భాటాలకు ఎప్పుడూ తాను దూరమే అని చెబుతూ అన్ని విషయాలు ప్రస్తావించింది.
తనకు నిరాడంబరంగా ఉండటమే ఇష్టమంటున్న ఆలియా.. తానెప్పుడూ అనవసరపు ఖర్చులను పోనని చెబుతోంది. తాను టీనేజర్‌గా ఉన్నప్పటి నుంచే ఖరీదైన వస్తువులు కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేదాన్నని ఆమె చెప్పుకొచ్చింది. ఇక హాలీడే ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు తనకు షాపింగ్ చేయడమంటే అస్సలు ఇష్టం ఉండదని ఆమె పేర్కొంది.

కాకపోతే తనకు హ్యాండ్ బ్యాగ్స్, అథ్లైజర్ దుస్తులపై మక్కువ ఎక్కువని, వాటి కోసం మాత్రం కాస్త ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తానని చెప్పింది ఆలియా. తన మొదటి సంపాదనతో ఖరీదైన 'లూయిస్ వుట్టన్' హ్యాండ్ బ్యాగ్‌ను కోనుగొలు చేశానని ఆమె తెలిపింది.
అలాగే తన కలల ఇంటి గురించి మాట్లాడిన ఆలియా.. విలాసవంతమైన ప్రైవేటు జెట్‌తో పాటు పర్వతాల మధ్య ఒక ఇల్లు కట్టుకోవాలన్నది తన కల అని భవిష్యత్తులో కచ్చితంగా వాటిని నెరవేర్చుకుంటానని చెప్పింది. అదేవిధంగా లండన్‌లో ఒక ఇంటిని కొనాలన్న తన కలను నెరవేర్చుకున్నానని.. 2018లో కోవెంట్ గార్డెన్‌లోని ఓ ఇంటిని కొనుగోలు చేశానని వెల్లడించింది. ప్రస్తుతం ఆలియా RRR సినిమాలో నటిస్తోంది.