కారు డ్రైవర్‌కి 50 లక్షల ఇల్లు కొనిచ్చిన హీరోయిన్, పని మనిషికి కూడా.. ఎందుకో తెలుసా!
Recommended Video

క్రేజీ హీరోయిన్ అలియా భట్ జన్మదిన వేడుకలు ఇటీవలే ముగిశాయి. అలియా భట్ కు సాయం చేసే గుణం ఉందని బాలీవుడ్ లో అందరూ చెబుతుంటారు. కానీ తాను చేసిన మంచి పనుల గురించి అలియా భట్ ఎప్పుడూ చెప్పుకోదు. మార్చి 15న అలియా భట్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బర్త్ డేకి కొద్దిరోజుల ముందు అలియా భట్ ఎలాంటి సాయం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. తాను బాలీవుడ్ లోకి ప్రవేశించినప్పటి నుంచి సునీల్ అనే వ్యక్తి అలియాకు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అలియా ఇంట్లో అమోల్ అనే మహిళ పని మనిషిగా పనిచేస్తోంది. అలియా భట్ తమపై చూపించిన ప్రేమకు వారిద్దరూ సంతోషంలో మునిగితేలుతున్నారు.

కెరీర్ ఆరంభం నుంచి
సునీల్, అమోల్ ఇద్దరూ తన కెరీర్ ఆరంభం నుంచి అలియా భట్ కోసం కష్టపడుతున్నారు. నటిగా అలియా భట్ బాలీవుడ్ లో ఎంతో ఎదిగింది. స్టార్ హీరోయిన్ గా మంచి పారితోషికం అందుకుంటోంది. వారిద్దరి కోసం ఏదైనా చేయాలని అలియా భావించిందట. అందుకే తన 26వ పుట్టినరోజు కానుకగా వారిద్దరికీ గుర్తుండిపోయే బహుమతి అందించింది.

50 లక్షల విలువైన
సునీల్, అమోల్ ఇద్దరికీ అలియా చెరొక సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని కొని ఇచ్చింది. ఒక్కొక్క ఇంటి విలువ 50 లక్షలు. ముంబైలోని ఖరీదైన ప్రాంతంలోనే అలియా వీరిద్దరికి ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇనేళ్ళుగా తన కోసం కష్టపడుతున్న వారికి తాను ఇచ్చిన గౌరవంగా అలియా భావిస్తోందట. ఈ వార్త గురించి తెలుసుకున్నవారంతా అలియా భట్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

భారీ చిత్రాలతో
అలియా భట్ ప్రస్తుతం భారీ చిత్రాలతో దూసుకుపోతోంది. వరుణ్ ధావన్ సరసన నటించిన కళంక్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు తన ప్రియడు రణబీర్ కపూర్ సరసన భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్రలో నటిస్తోంది. నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు.

రాంచరణ్‌కు జోడిగా
ఇదిలా ఉండగా దేశం మొత్తం ఎదురుచూస్తున్న రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ లో అలియా భట్ అవకాశం దక్కించుకుంది. అలియాకు ఇది తొలి తెలుగు చిత్రం. రాంచరణ్ సరసన అలియా భట్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్వాతంత్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్నారు. రాజమౌళి తన గురించి ప్రకటన చేయగానే అలియా భట్ సంతోషం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











