అతడితో నా కుమార్తె పెళ్లి డౌటే.. ఏం జరుగుతుందో చెప్పలేను.. హీరోయిన్ తండ్రి హాట్ కామెంట్స్!

బాలీవుడ్ హీరోయిన్లు వరుసగా వివాహాల బాట పడుతున్నారు. అనుష్క శర్మ, దీపికా పదుకొనె, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా ఇలా వరుసగా స్టార్ హీరోయిన్లు తమ తోడుని వెతుక్కుని వైవాహిక జీవితంతో సెటిల్ అయ్యారు. దీనితో పెళ్లీడు వచ్చిన మిగిలిన హీరోయిన్ల గురించి కూడా చర్చ మొదలయింది. ఎప్పుడూ బడా హీరోయిన్లతో డేటింగ్ లో మునిగితేలే రణబీర్ కపూర్, క్యూట్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా బాలీవుడ్ లో తెగ చర్చ జరుగుతోంది. అలియా భట్ తండ్రి మహేష్ భట్ అలియా ప్రేమ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కత్రినాతో విడిపోయాక

కత్రినాతో విడిపోయాక

రణబీర్ కపూర్ గతంలో కత్రినా కైఫ్ తో ఘాటు రొమాన్స్ చేశాడు. వాళ్లిద్దరి ఫోటోలు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి. సంవత్సరాల పటు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ 2016లో విడిపోయారు. అప్పటినుంచి ఒంటరిగా ఉన్న రణబీర్ కు అలియా భట్ రూపంలో మరో ప్రేమ దొరికిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ రిలేషన్ షిప్ అయినా పెళ్లి వరకు వెళుతుందా లేదా అని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అలియా భట్ తండ్రే

అలియా భట్ తండ్రే

వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్న విషయాన్ని అలియా భట్ తండ్రి మహేష్ భట్ ధృవీకరించారు. ఓ ఇంటర్వ్యూలో మహేష్ భట్ మాట్లాడుతూ.. రణబీర్ కపూర్ చాలా మంచి వ్యక్తి. అతడంటే నాకు ఇష్టం. అలియా, రణబీర్ ప్రేమలో ఉన్నారని తెలుసుకోవడానికి తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదు అని అన్నారు. దీనితో అలియాభట్ కు తండ్రి నుంచి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు అయింది.

పెళ్లి మాత్రం డౌటే

పెళ్లి మాత్రం డౌటే

ప్రస్తుతం వాళ్ళిద్దరి రిలేషన్ షిప్ సవ్యంగా సాగుతుందని అనుకుంటున్నా. బంధాన్ని వాళ్లిద్దరూ పెళ్లి వరకు తీసుకుని వెళతారా లేదా అని నేను చెప్పలేదు. ఎందుకంటే ప్రస్తుతం యువతీ యువకుల ఆలోచనల్ని అంచనా వేయడం కష్టం. ఎప్పుడు ఏం జరుగుతుందో ముందుగా చెప్పలేం అని అన్నారు. కానీ నావరకు వచ్చే ఏడాది వాళ్లిద్దరూ పెళ్లిపీటలెక్కుతారని ఆశాభావంతో ఉన్నట్లు మహేష్ భట్ తెలిపారు.

 బ్రహ్మాస్త్ర

బ్రహ్మాస్త్ర

ప్రస్తుతం అలియా భట్, రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కు అలియా, రణబీర్ జంటగా హాజరై అందరిని ఆశ్చర్యపరిచారు. వీరిద్దరూ ఎక్కడ చూసినా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడంతో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X