అలియా భట్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ప్రియుడికి విషాదం నేపథ్యంలో..
గత కొద్దికాలంగా బాలీవుడ్ పెళ్లిళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అనుష్క, విరాట్, ఆ తర్వాత దీపిక, రణ్‌వీర్ సింగ్ వివాహాలతో హిందీ చిత్ర పరిశ్రమ సందడిగా మారింది. కొద్ది రోజులుగా డేటింగ్ వార్తలతో మీడియాలో ప్రముఖంగా మారిన అలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. అయితే వీరి పెళ్లి తేదీ కూడా ఖారారైనట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

మా మధ్య అఫైర్ ఉంది
అలియా భట్, రణ్‌బీర్ కపూర్ అఫైర్‌కు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమ రిలేషన్‌పై బహిరంగంగా ప్రకటన చేసేశారు. తమ మధ్య రిలేషన్ ఉందని మీడియాకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి గురించి ఇప్పుడే చెప్పలేను.. కానీ మా మధ్య రిలేషన్ చాలా ఆరోగ్యకరంగా సాగుతున్నదని అలియా ప్రకటించింది.

రణ్‌బీర్ కపూర్ తండ్రికి క్యాన్సర్
అలియాభట్‌తో అఫైర్ సాగుతున్న నేపథ్యంలో రణ్‌బీర్ కుటుంబంలో విషాద వార్త చోటుచేసుకొన్నది. తండ్రి రిషి కపూర్‌కు క్యాన్సర్ రావడంతో అమెరికాలో చికిత్స చేయించారు. ఆ సమయంలో కొత్త సంవత్సరం వేడుకలను రిషికపూర్‌తో కలిసి అలియా, రణ్‌బీర్ కపూర్ జరుపుకొన్నారు.

ఇరు కుటుంబాల నిర్ణయం
ప్రస్తుతం రిషీ కపూర్ ఆరోగ్యం కుదుటపడింది. త్వరలోనే ఆయన స్వదేశానికి తిరిగి రానున్నారు. రిషి కపూర్ ఆరోగ్యం పరిస్థితి దృష్టి పెట్టుకొని కపూర్ కుటుంబ సభ్యులు రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేయాలని నిర్ణయించారట. ఈ విషయాన్ని అలియాభట్ కుటుంబానికి చెప్పడంతో ఇరు కుటుంబాలు భేటీ అయ్యారట.

ఏప్రిల్‌లో అలియా, రణ్‌బీర్ వివాహం
అలియా, రణ్‌బీర్ పెళ్లిని ఏప్రిల్‌లో జరిపించేందుకు వేద పండితులు ముహుర్తం పెట్టినట్టు బాలీవుడ్ పత్రిక కథనాన్ని వెల్లడించింది. అంతా సవ్యంగా జరిగితే ఏప్రిల్ రెండోవారంలో గానీ, లేదా చివరి వారంలో అలియా, రణ్‌బీర్ పెళ్లీ పీటలు ఎక్కడం ఖాయమంటున్నారు.

బ్రహ్మస్త్రలో కలిసి నటిస్తున్న జంట
ప్రస్తుతం అలియాభట్, రణ్‌బీర్ కపూర్ ఇద్దరు కలిసి బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నారు. కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన్ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తోపాటు మన్మథుడు నాగార్జున కూడా కీలక పాత్రను పోషించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











