twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రణ్‌బీర్, ఆలియా భట్ పెళ్లి ఫొటో వైరల్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా? హాట్ టాపిక్

    |

    ఓ హీరో, హీరోయిన్ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని తెలిస్తే చాలు.. వారి చుట్టే చేరతాయి కెమెరాలన్నీ. వాళ్లనే ఫాలో అవుతూ వారి వారి ప్రతీ సందర్భాన్ని అనుక్షణం వెంటాడుతూనే ఉంటాయి కెమెరా కళ్లు. ఈ మేరకు వారి ప్రేమ, పెళ్లి సంగతుల గురించిన అప్‌డేట్స్ బయటకొస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లికి సంబంధించిన ఓ పిక్ నెట్టింట సెన్సేషన్ అవుతోంది. ఇంతకీ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఈ ఫొటో ఎక్కడిది? వివరాల్లోకి పోతే..

    గత కొంత కాలంగా ప్రేమాయణం.. మీడియాలో హాట్ టాపిక్

    గత కొంత కాలంగా ప్రేమాయణం.. మీడియాలో హాట్ టాపిక్

    బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమ మత్తులో ముగి తేలుతున్నారని గత కొంత కాలంగా వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి విదేశీ ప్రయాణం చేయడం, పలు కార్యక్రమాల్లో మెరుస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అతి త్వరలో వీరి పెళ్లి జరగనుందని ఫిక్స్ అయ్యారంతా.

    సీక్రెట్‌గా పెళ్లి.. నెట్టింట ఫొటో వైరల్

    సీక్రెట్‌గా పెళ్లి.. నెట్టింట ఫొటో వైరల్

    సరిగ్గా ఇలాంటి తరుణంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పెళ్లి కూతురిలా తయారై రణ్‌బీర్ కపూర్ మెడలో దండ వేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఆలియా భట్. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఇద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారేమో అని భ్రమ పడ్డారు. కానీ అసలు విషయం తెలిసి మరింత ఆశ్చర్యపోయారు.

    ఇదీ అసలు విషయం

    నిజానికి ఇది రియల్ ఫొటో కాదు. మోహే కలెక్షన్స్ అనే బ్రాండ్ రూపొందించిన కమర్షియల్ యాడ్ లో ఆలియా నటించింది. పెళ్లి కూతురిలా తయారై వరుడి మెడలో దండ వేస్తున్నట్లుగా ఆ యాడ్‌ షూట్ చేశారు. దీంతో ఈ యాడ్ లోని ఫొటో తీసుకొని, అందులోని వరుడికి బదులుగా రణ్‌బీర్ కపూర్ యాడ్ చేశాడు ఓ నెటిజన్. దీంతో ఈ ఇద్దరికీ నిజంగా పెళ్ళైపోయిందేమో అనుకొని నెటిజన్లు ఈ ఫోటోని వైరల్ చేసేశారు.

    నిశ్చితార్థం ఏర్పాట్లు.. 2020లో పెళ్లి

    నిశ్చితార్థం ఏర్పాట్లు.. 2020లో పెళ్లి

    రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ వివాహం 2019 చివర్లోనే జరగాల్సి ఉండగా, రణ్‌బీర్ తండ్రి రిషీ కపూర్ అనారోగ్యం కారణంగా వాయిదాపడిందని తెలుస్తోంది. ప్రస్తుతం రిషీ కపూర్ కోలుకోవడంతో వెంటనే నిశ్ఛితార్థం జరగాలని ఇరు కుటుంబాలూ అనుకుంటున్నాయట. అందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలిసింది. 2020లో వీరి పెళ్లి జరగనుందని సమాచారం.

     RRR లో ఆలియా

    RRR లో ఆలియా

    బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న ఆలియా భట్ RRR సినిమాతో టాలీవడ్ తెరపై కాలుమోపుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది. 2020 జులై 30 న ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    Ranbir Kapoor and Alia Bhatt recently fly to Europe for a romantic journey. This set tongues wagging and whispers began doing the rounds.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X