పెళ్ళికి సిద్ధం అవుతున్న రణబీర్ కపూర్, అలియా భట్!
Recommended Video

రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో మునిగితేలుతున్నారని మీడియా మొత్తం ఢంకా బజాయించి చెబుతోంది. అందుకు తగ్గట్లుగానే వీరిద్దరూ పబ్లిక్ గా తిరగేస్తున్నారు. ఆమె మధ్యన సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ లో చెట్టాపట్టాలేసుకుని కనిపించిన సంగతి తెలిసిందే. తాజగా వీరిద్దరూ పెళ్లి విషయంలో కూడా ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాలో వీరి పెళ్లి వార్త గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.

2020 లో వివాహం
రణబీర్ కపూర్, అలియా భట్ 2020 లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పలు బాలీవుడ్ వెబ్ సైట్స్ కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ బ్రహ్మాస్త్ర అనే చిత్రంలో నటిస్తున్నారు.

రొమాంటిక్ వీరుడు
రణబీర్ కపూర్ కి రొమాంటిక్ వీరుడిగా బాలీవుడ్ జనాల్లో పేరు ఉంది. దీపికా పాడుకొనే, కత్రినా కైఫ్, సోనమ్ కపూర్ ఇలా పలువురు భామలతో రణబీర్ ప్రేమాయణం సాగిందనే వార్తలు ఉన్నాయి. వీటిలో దీపికా, కత్రినా కైఫ్ తో బ్రేక్ అప్ కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

క్రేజీ స్టార్
సినిమాల్లో కూడా రణబీర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. సంజయ్ దత్ బయోపిక్ చిత్రం సంజుతో త్వరలో ఆడియన్స్ ని పలకరించేందుకు రణబీర్ సిద్ధం అవుతున్నాడు.

పెళ్లి గురించి అభిమానులతో
ఇటీవల తన పెళ్లి గురించి రణబీర్ అభిమానులకు సమాధానం ఇచ్చాడు. సోషల్ మీడియా చాట్ లో పెళ్లి ఎప్పుడు అని ఫాన్స్ అడిగిన ప్రశ్నకు రణబీర్ సమాధానం ఇచ్చాడు. త్వరలోనే ఉంటుంది అని చెప్పడం విశేషం.


Click it and Unblock the Notifications











