twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరు చూడని ఫొటోలను షేర్ చేసిన అలియా భట్.. భర్తతో అలా రొమాంటిక్ స్టిల్స్!

    |

    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ లవ్ బర్డ్స్ గా క్రేజ్ అందుకుంటున్న అలియా భట్, రణ్‌బీర్‌ కపూర్ పెళ్లి అనంతరం మరింత ఎక్కువగా హైలెట్ అవుతున్నారు. బాలీవుడ్ రొమాంటిక్ లవర్ బాయ్ అయినటువంటి రణ్‌బీర్‌ క్యూట్ హీరోయిన్ అలియా భట్ తో దాదాపు ఐదు సంవత్సరాల పాటు డేటింగ్ చేశాడు. అసలు వీరి పెళ్లి జరిగే అవకాశం లేదని ఆ మధ్య కొన్ని వార్తలు కూడా జోరుగా వచ్చాయి. కానీ ఏదేమైనా ఇద్దరు పెళ్లి చేసుకొని వారి మ్యారేజ్ లైఫ్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా మరికొన్ని రొమాంటిక్ ఫొటోలను పోస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ఆలియా భట్ ప్రేమను..

    ఆలియా భట్ ప్రేమను..

    ఐదేళ్ల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత, ఆలియా భట్ రణబీర్ కపూర్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదివరకే రణ్‌బీర్‌ కొంతమంది హీరోయిన్స్ తో డేటింగ్ కూడా చేశాడు. ఇక వాళ్ళతో చాలా తొందరగానే బ్రేకప్ చెప్పిన ఈ స్టార్ హీరో ఆలియా భట్ ప్రేమను మాత్రం అస్సలు వదులు కోలేదు. మధ్య మధ్యలో వీరికి గొడవ అయినట్లు టాక్ వచ్చినప్పటికీ అవేవి పట్టించుకోకుండా ప్రేమలో వారికి నచ్చినన్ని రోజులు మునిగి తేలారు.

     రూమర్స్ ఎన్ని వచ్చినా..

    రూమర్స్ ఎన్ని వచ్చినా..

    అయితే మధ్యలో రణ్‌బీర్‌ మరొక హీరోయిన్ కారణంగా ఆలియా భట్ కు విడాకులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ రూమర్స్ ఆలియా వరకు వచ్చినప్పటికీ ఆమె వాటిని నవ్వుతూ కామెడీగా తీసుకుంది. ఇక పెళ్లి ఎప్పుడు అని అడిగితే ఆ ప్రశ్నపై ఆమె ఎప్పుడు కూడా సరైన సమాధానం అయితే ఇవ్వలేదు.

     పెళ్లి తరువాత..

    పెళ్లి తరువాత..

    ఇక మొత్తానికి పెళ్లి బంధంతో గత నెల 14న ఒకటైన ఈ జంట సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. పెళ్లి తరువాత కూడా వీరు ఎప్పటిలానే లవ్ బర్డ్స్ తరహాలో హైలెట్ అవుతున్నారు. గతంలో కంటే ఎక్కువ స్థాయిలో వారి ప్రేమను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

     ఎవరు చూడని పెళ్లి ఫొటోలు

    ఎవరు చూడని పెళ్లి ఫొటోలు

    ఇక రీసెంట్ గా ఆలియా భట్, తన భర్త రణ్‌బీర్‌ తో కలిసి దిగిన మరికొన్ని రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మే 14న, ఈ జంట పెళ్లి జరిగి నెల రోజులు అయిన సందర్భంగా అలియా తన భర్త రణబీర్‌తో ఇంతవరకు ఎవరు చూడని పెళ్లి ఫోటోలను షేర్ చేసుకుంది. ఇక ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి.

    తెలుగులో కూడా..

    తెలుగులో కూడా..

    ఇక ఆలియా భట్ తెలుగు హీరోల సినిమాలతో కూడా బిజీ అవ్వడానికి ప్రయత్నం చేస్తోంది. RRR సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు మరింత డిమాండ్ పెరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో కూడా నటించే అవకాశం ఉంది. మరోవైపు రణ్‌బీర్‌ తన బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో కూడా రాజమౌళి సమర్పణలో విడుదల చేస్తున్నాడు. ఆ విధంగా రణ్‌బీర్‌ మోదటిసాటి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వబోతున్నాడు.

    English summary
    Alia Bhatt Ranbir Kapoor unseen marriage pics viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X