Ranveer Singh Nude Photoshoot పై దారుణంగా.. జీర్ణించుకోలేకపోతున్నా.. ఆలియా భట్ కామెంట్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒంటిపై నూలుపోగు లేకుండా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోటోషూట్ చేయడం అత్యంత వివాదంగా మారింది. రణ్‌వీర్ సింగ్ వ్యవహారంపై మీడియాలోను, సోషల్ మీడియాలోను దారుణంగా ట్రోలింగ్ జరిగింది. అయితే ఈ వివాదంపై, అలాగే రణ్‌వీర్ సింగ్ ఫోటోషూట్‌పై స్పందించమని ముంబైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆలియాభట్‌ను కోరితే ఆమె ఏమని స్పందించిందంటే..

పాప్ ఐకాన్ కోసం రణ్‌వీర్ సింగ్
కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ న్యూడ్‌గా ఫోటోషూట్ చేశాడు. 70వ దశకంలో పాప్ ఐకాన్ బర్ట్ రేనాల్డ్స్ ఈ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసి అప్పట్లో సంచలనం రేపాడు. బర్ట్ రేనాడ్స్‌కు నివాళిలర్పించేందుకు కోసం రణ్‌వీర్ సింగ్ ఈ ఫోటోషూట్ చేశాడు. గోడకు బల్లిలా అతుక్కొని.. నేలను కరుచుకొని రణ్‌వీర్ ఫోటోషూట్‌కు ఫోజిచ్చాడు.

డార్లింగ్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో
ముంబై మీడియాలో రణ్‌వీర్ సింగ్ ఫోటోషూట్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో తాను నటించి, నిర్మించిన డార్లింగ్స్ అనే సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆలియాభట్ పాల్గొన్నారు. పసుపు పచ్చ రంగు స్లీవ్‌లెస్ స్కర్ట్‌లో అందర్నీ ఆకట్టుకొన్నారు. మీడియా ఇంటారాక్షన్ సందర్భంగా రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ గురించి స్పందించమని ఒత్తిడి తీసుకొచ్చారు.

రణ్‌వీర్ నాకు ఫేవరేట్
రణ్‌వీర్ నాకు క్లోజ్ ఫ్రెండ్. అతడిపై నెగిటివ్‌గా నేను మాట్లాడానికి ఇష్టపడను. బాలీవుడ్ హీరోల్లో నాకు ఆయన ఫేవరేట్. మీరు అడిగే ప్రశ్ననే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఆయనంటే నాకే కాదు.. ఇక్కడ ఉన్న అందరికి ప్రేమ ఉంది. అతడు సినిమా పరిశ్రమకు చాలా ప్రేమను పంచాడు. కాబట్టి అతడిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను అని ఆలియా భట్ తన మిత్రుడికి అండగా నిలిచింది.
ఆసక్తికరంగా డార్లింగ్ ట్రైలర్
డార్లింగ్స్ సినిమా విషయానికి వస్తే.. డార్క్ కామెడీగా రూపొందిన చిత్రం. ఆలియాభట్ హీరోయిన్‌గా, ఆమె తల్లి షెఫాలీ షా నటించారు. ఆలియా భర్తగా విజయ్ వర్మ కనిపించారు. తన భర్త కనిపించడం లేదని ఆలియా, ఆమె తల్లి వెళ్లి పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం ట్విస్టుగా కనిపిస్తుంది. వారిద్దరే కిడ్నాప్ చేసి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారనేది డార్లింగ్స్ ఇంట్రెస్టింగ్ అంశంగా ట్రైలర్‌లో కనిపించిం

నిర్మాతలుగా ఆలియా, షారుక్, గౌరీ ఖాన్
డార్లింగ్స్ సినిమాకు తన సొంత బ్యానర్‌పై ఆలియాభట్ నిర్మించారు. ఈ సినిమాకు షారుక్ ఖాన్, గౌరీ ఖాన్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. జస్మీత్ కే రీన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











